MANAGUDI MATERIALS READIED_ ”మనగుడి” పూజ సామగ్రి సిద్ధం

Tirupati 13 August 2018: The pooja materials for the 12th phase of Managudi set ready by Hindu Dharma Prachara Parishad (HDPP) wing of TTD on Monday.

The “Akshata” (Holy Rice) for Managudi was prepared by Srivari Seva volunteers in SVETA building after performing special puja.

The HDPP Secretary Sri Ramana Prasad speaking on this occasion, said, this time Managudi will be observed in 11,730 temples across AP and Telegnana states. “We will dispatch the puja materials to all these temples by August 20 for the religious event which will be observed from August 23 to 26”, he maintained.

SVETA Director Sri N Muktheswara Rao, AEO HDPP Sri Nageswara Rao, Superintendent Sri Gurunatham were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

”మనగుడి” పూజ సామగ్రి సిద్ధం

తిరుపతి, 2018 ఆగస్టు 13: ప్రఖ్యాత హైందవ దార్మిక సంస్థ అయిన టిటిడి ధర్మప్రచారంలో భాగంగా ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ”మనగుడి” కార్యక్రమం నిర్వహణ కోసం ఆలయాలకు చేరవేసే అక్షింతల తయారీ కార్యక్రమం సోమవారం తిరుపతిలోని శ్వేతా భవనంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అక్షింతలు తయారు చేశారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీరమణప్రసాద్‌ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన 11,730 ఆలయాలలో మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ లోపు అన్ని ఆలయాలకు

శ్రీవారి కంకణాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, కలకండ, ఇతర పూజ సామగ్రిని ప్యాక్‌చేసి ఆయా ఆలయాలకు డిపిపి ద్వారా పంపిణీ చేయనున్నాట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో శ్వేతా సంచాలకులు శ్రీ ముక్తేశ్వరరావు, ఏఈవో శ్రీ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్‌ శ్రీ గురునాథం, శ్రీవారి సేవకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.