EMPLOYEES CANTEEN INAUGURATED IN TIRUPATI_ టిటిడి ఉద్యోగుల సౌకర్యాలకు పెద్దపీట తిరుపతిలో ఉద్యోగుల క్యాంటిన్‌ ప్రారంభించిన తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 13 August 2018: TTD JEO Sri P Bhaskar on Monday inaugurated the new building of Employees Canteen constructed at a cost of Rs.4.64crores in Tirupati.

Speaking on this occasion he said there are 20 thousand employees including regular and out sourcing are working in TTD. “When they brought to our notice about a new building for employees, we have readily agreed for their request to suffice their needs.The quality of food is also has been enhanced”, he added.

The building also holds a recreation hall and other facilities for the employees.

Local legislator Smt.Sugunamma was also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ఉద్యోగుల సౌకర్యాలకు పెద్దపీట తిరుపతిలో ఉద్యోగుల క్యాంటిన్‌ ప్రారంభించిన తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 ఆగస్టు 13: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సేవలందించే ఉద్యోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తునట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల బాస్కర్‌ ఉద్ఘాటించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఉద్యోగుల క్యాంటీన్‌ను సోమవారం తిరుపతి జెఈవో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడిలో దాదాపు 20 వేల మందికి పైగా ఉద్యోగులు సేవలందిస్తున్నరని, వీరికి మరింత నాణ్యమైన భోజనం అందించేందుకు నూతన క్యాంటీన్‌ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నూతన క్యాంటీన్‌ను రూ.4.64 కోట్లతో 27,365 ఎస్‌ఎఫ్‌టిలో దీనిని నిర్మించామన్నారు. ఇందులో 300 మంది ఉద్యోగులు కూర్చుని భోజనం చేసేందుకు డైనింగ్‌ హాల్‌, ప్రత్యేకంగా 100 మంది మహిళా ఉద్యోగులు భోజనం చేసేందుకు మరో డైనింగ్‌హాల్‌ నిర్మించినట్లు తెలిపారు. అదేవిధంగా 5,716 ఎస్‌ఎఫ్‌టిలో విశాలమైన అత్యాధునిక వంటశాలను నిర్మించామన్నారు. ఇందులో స్టేట్‌బ్యాంక్‌, ఆంధ్రబ్యాంక్‌, టిటిడి ఉద్యోగుల బ్యాంక్‌, పోస్ట్‌ఆఫీస్‌, ఉద్యోగుల కమ్యూనీటి హాల్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ హాలు నిర్మించినట్లు వివరించారు.

అనంతరం టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి మాట్లాడుతూ టిటిడి ఛైర్మన్‌, ఈవో, ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంతో అహ్లాదకర వాతావరణంలో నూతన క్యాంటీన్‌ను నిర్మించినట్లు తెలిపారు. ఇందులో దాదాపు 600 నుండి వెయ్యి మంది సౌకర్యవంతంగా బోజనాలు చేసేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్‌ఎల్‌ఏ శ్రీమతి సుగుణమ్మ, ఎమ్‌ఎల్‌సి శ్రీ యండవల్లి శ్రీనివాసులురెడ్డి, టిటిడి ఎస్‌ఇ1 శ్రీ రమేష్‌రెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, ఇఇ శ్రీ జయరాం నాయక్‌, డిఇ(ఎలక్ట్రికల్‌) శ్రీ రవిశంకర్‌రెడ్డి, క్యాటరింగ్‌ అధికారి శ్రీదేశాయ్‌రెడ్డి, ఇతర అధికారులు, టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.