MANDAPAMS OF TIRUMALA – ARCHITECTURAL AND HISTORICAL MARVEL _ శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు – భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు

Tirumala, 20 Sep. 19: The lush green forests of Seshachala houses, world famous Hindu deity Sri Venkateswara Swamy, who is also revered as Perumal, Venkatachalapati, Tirumalesa, Govinda, Balaji and many more names.

Mandapams:

The ancient temple of Lord Venkateswara in the hill shrine of Tirumala is an amazing complex of history, culture and traditions. Almost every brick speaks volumes of the cultural journey of the temple from the past several centuries.

According to saint poet Sri Tallapaka Annamayya, the various Mandapams and constructions inside the Srivari temple served as shelters to the devotees at times of heavy rains and scorching summer besides being served as platforms for temple rituals and stand here to tell the volumes of history.
These temples not only have historical and mythological significance but also standing as architectural marvel. A peep into these mandapams:

DWAJASTHAMBHA MANDAPAM:

Dwajasthambham, the golden flagstaff is located in the middle of a twenty-pillared square pavilion. To the East of the flagstaff there is an altar or Balipeetham and to the northeast, there is granite stone called ‘Kshetrapalakasila’. This pavilion is said to have been constructed in the fifteenth century.

During Brahmotsavams, a flag with Garuda’s imprint is hoisted on this flagstaff for extending an invitation to gods and goddesses (Yaksha, Kinnera and Gandharva), to attend this festival. Those wishing to take pooja material or other things into the sanctum, have to perform circumambulation along dwajasthamba including the Lord whenever he is taken outside or returned to the main temple.

KRISHNADEVARAYA MANDAPAM:

Abutting the Mahadwara and to its right, there is a high-rise mandapam (Porch). This is called Krishnadevarayalu Mandapam or Pratima Mandapam. This mandapam has been constructed in Vijayanagara architectural style. To the right side of this porch, one can find tall copper statues of the emperor of Vijayanagara kingdom, Sri Krishnadevarayalu and his two consorts, Tirumala Devi and Chinnadevi.
These three statues placed in front of Lord Sri Venkateswara express their devotion to him. It is said that Sri Krishnadevarayalu himself installed these statues on 2nd January 1517 A.D. and then onwards this mandapam has become famous as the Krishnadevarayalu Mandapam. Their names are inscribed on the shoulder badges of these statues.

FOUR PILLAR MANDPAM:

Four pavilions in the four corners of ‘Sampangi Pradakshinam’ were built by Saluva Narasimha Raya in 1470 A.D. in the names of himself, his wife and his two sons.

RANGANAYAKULA MANDAPAM OR RANGA MANDAPAM:

Ranganayakula Mandapam was built in Vijayanagara style architecture and decorated with floral carvings and tales and stories from Ramayana and other puranas on the pillars, walls and ceiling.
In the middle of the Southern end of Ranga Mandapam, there’s a small Garbha Griha constructed, believed to accommodate and offer daily sevas to the Utsava Murthies of Sri Ranganadha Swamy of Srirangam, which were stationed here in Tirumala for a brief period between 1320 and 1360 and shielded from the Muslim invader Malik Kafur.

Snapana Tirumanjanam during the annual brahmotsavams are held here and Ranganadha Mandapam is fully decorated with various flowers and fruits for the event. This Mandapam is also famous by name Ranganayakula Mandapam.

KALYANOTSAVA MANDAPAM:

Earlier all wedding festivities of the Lord were celebrated at the pavilion in the ‘Vimana Pradakshinam’. With the increase in the number of the devotees attending the events, these festivities started being held for some time in Ranganayaka Mandapam.

Now the wedding festivities of the Lord Malayappa swami Varu are celebrated at this pavilion Now, hence this place is called Kalyanotsava Mandapam.

This prakaram, in the olden days, was called Sampangi Praakaram, which is between the outer and inner prakarams of the temple. Pavitrotsavam, Pushpayagam and Jyestabhisekham are also performed here in this Kalyanotsava Mandapam.

TIRUMALARAYA MANDAPAM:

Tirumala Raya Mandapam adjoining the Ranga Mandapam on the western side and facing the Dhvajasthambha Mandapam is a spacious complex of pavilions known as the Tirumala Raya Mandapam. This was built by Saluvanarasimharayalu, the emperor of Vijayanagara, to express his gratitude to the Lord for the help extended towards his victories.

It consists of two different levels, the front at a lower level and the rear at a higher carved in black granite stone with period architecture of vines, yalis and stucco features. It is in this Mandapam, that the utsava murthi Sri Malayappa holds His annual darbar or Anivari Asthanam during the hoisting of the Garudadhwaja on Dhwajastambham to mark the commencement of Brahmotsavams.

Incidentally, the prasadam distributed on this occasion is still called Tirumalaraya Pongal. The Mandapam has a typical complex of pillars in the Vijayanagara style with rearing horses.

ANNA UNJAL MANDAPAM

The southern inner portion of this Mandapam was constructed by Saluva Narasimha in 1473 AD to celebrate a festival for Sri Venkateswara called Anna Unjal Tirunal.

It is in this Mandapam, that the utsava murthi Sri Malayappa holds His annual Durbar or Anivara Asthanam during the hoisting of the Garudadhwaja on Dhwajastambham to mark the commencement of Brahmotsavams

ADDALA MANDAPAM OR AINA MAHAL

The Aina Mahal or the Mirror hall is on the northern side of the Tirumala Raya Mandapam spread over 42 square feet each two chambers.

It consists of two parts – an open mandapam in the front consisting of six rows comprising six pillars each, and a shrine behind it consisting of an Antarala and Garbhagriha. It has large mirrors which reflect beauty and fiery of the idols infinitely from all angles when the unjal seva is performed.
The arjitha seva which is performed in the middle of the room every day with Lord and His consorts seated on the golden unjal is called “Dolotsavam”.

GARUDA MANDAPAM:

Just opposite to the golden gate and facing the Lord there is a six feet high statue of Garuda saluting the Lord with folded hands.

Every day at the pre-dawn hour, Suprabhatham is recited in the place between the golden gate and the statue of Garuda.

The Lord sitting on the golden throne in this mandapam, listens to the recital of almanac and the submissions of receipt and expenditure account of the previous day.

GOLLA MANDAPAM:

This is a four pillared centuries old structure located in front of Tirumala temple believed to have been constructed by a milk maid who dedicated her life in the devotion of Sri Venkateswara Swamy. Hence the name Golla Mandapam.

ASTHANA MANDAPAM:

Asthana Mandapam is a closed auditorium located adjacent to Bedi Anjaneya Swamy temple, opposite the main temple complex, which hosts several cultural programs, parayanam, Bhajans, musical concerts, harikathas, satsangs etc.

The events are organized under the supervision of Hindu Dharma Prachara Parishad wing of TTD and serves as an elite podium of cultural extravagance aimed for the spiritual and devotional enlightenment of the visiting devotees.

SAHASRA DEEPALANKARA SEVA MANDAPAM:

Sahasra Deepalankara seva is the only daily seva that is performed outside the temple. The seva is performed in the Unjal Madapam located on the south eastern corner of the Srivari Temple at 5pm every day. This seva is performed with one thousand ghee lit wick lamps and Sri Malayappa Swami along with Sridevi and Bhudevi are seated on a swing even as the artistes render Annamacharya and Purandhara Dasa sankeertans. Later the deities were taken out in a procession around the four mada streets and Pushkarini Harati is rendered before the deities enter inside the main temple.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల ప్ర‌త్యేక వ్యాసం

శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు – భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు

తిరుమల, 2019 సెప్టెంబ‌ర్ 20: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని మండ‌పాల‌ను ఆనాటి చ‌క్ర‌వ‌ర్తులు, రాజులు అద్భుత‌మైన శిల్ప క‌ళా నైపుణ్యంలో నిర్మిచారు. ఇందులో మ‌హాద్వారం, కృష్ణరాయమండపం, రంగనాయక మండపం, తిరుమలరాయ మండపం, అద్దాల మండపం – ఐనా మహల్‌, ధ్వజస్తంభ మండపం, కళ్యాణ మండపం త‌దిత‌రాలు ఉన్నాయి. ఇక్క‌డ ఉన్న పైక‌ప్పు, స్థంభాల‌పై కృష్ణ‌స్వామివారు, ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి, వ‌రాహ‌స్వామి, శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి త‌దిత‌ర దేవ‌తా మూర్తులు, ల‌క్ష్మీదేవి అమ్మ‌వారి వివిద రూపాలు, జంతువులు, ల‌త‌లు, పుష్పాల‌తో కూడిన శిల్పాల‌తో నిర్మించారు.

ప్ర‌ధాన గోపురం లేదా మ‌హాద్వారంను 13వ శ‌తాబ్ధంలో నిర్మించిన‌ట్లు ఆల‌యంలోని శాస‌నాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడే కుడిగోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గుణపం వ్రేలాడదీయబడి ఉంటుంది.

కృష్ణరాయమండపం :

మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్థంభాల‌పై ముస‌లిపై ఉన్న సింహం, దానిపై కుర్చుని స్వారి చేస్తున్న వీరుల శిల్పాల‌తో కూడిన ఎతైన మండపమే కృష్ణరాయమండపం. ఈ మండ‌పంలో కుడివైపున తిరుమల దేవి, చిన్నాదేవిలతో కూడిన శ్రీకృష్ణదేవ‌రాయల నిలువెత్తు రాగి ప్రతిమలు, ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాగిప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించాడు.

రంగనాయక మండపం :

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల‌ మండపాన్ని శ్రీరంగనాథ యాదవ రాయలు క్రీ.శ 1310 – 1320 మధ్య కాలంలో నిర్మించారు. ఈ మండ‌మంలో వివిద‌ రకాల శిల్పాలతో సుందరంగా మండప‌ నిర్మాణం జరిగింది. క్రీ.శ 1320 – 1360 మ‌ధ్య కాలంలో శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదా శీర్వచనంతోపాటు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేస్తారు.

తిరుమలరాయ మండపం :

రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాల మండపమే అన్నా – ఊంజ‌ల్‌మండ‌పం లేదా తిరుమలరాయ మండపం అంటారు. ఈ మండపంలోని వేదిక భాగాన్ని క్రీ.శ. 1473లో సాళువ నరసింహరాయలు నిర్మించగా, క్రీ.శ.16వ శ‌తాబ్ధంలో సభాప్రాంగణ మండపాన్ని ఆర‌వీటి తిరుమలరాయలు నిర్మించాడు. ఇందులోని స్థంభాల‌పై శ్రీ వైష్ణ‌వ, ప‌శు-ప‌క్ష‌దుల‌ శిల్పాలు ఉన్నాయి. ఈ మండపంలో రాజా తోడ‌ర‌మ‌ల్‌, అత‌ని త‌ల్లి మాతా మోహ‌నా దేవి, భార్య పిటా బీబీ లోహ విగ్ర‌హ‌లు ఉన్నాయి.

బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీవారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.

అద్దాల మండపం – ఐనా మహల్‌ :

కృష్ణరాయ మండపానికి ఉత్తరం దిక్కున ఉన్నదే అద్దాల మండపం లేదా ఐనా మహల్ అంటారు. దీనిని 36 స్థంభాల‌తో అద్బుతంగా నిర్మిచారు. ఇందులో మందిరం దీనికి అంత‌రాళం గ‌ర్భ‌గృహం ఉన్నాయి. ఇక్క‌డ ప్ర‌తి రోజు స్వామివారికి డోలోత్స‌వం నిర్వ‌హిస్తారు.

ధ్వజస్తంభ మండపం :

రెండ‌వ గోపుర‌మైన వెండి వాకిలిని తాకుతూ ధ్వజస్తంభ మండపాన్ని క్రీ.శ 1470లో విజ‌య‌న‌గ‌ర చ‌క్ర‌వ‌ర్తి సాళ్వ న‌ర‌సింహ‌రాయులు నిర్మించారు. 10 రాతి స్థంభాల‌తో నిర్మిచిన మండ‌పంలో బంగారు ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. ఈ స్థంభాల‌పై వివిద దేవ‌తామూర్తుల శిల్పాలు, ఇంకా సృష్ఠికి సంబంధించిన స్త్రీ, పురుషుల సంబంధాల‌ను తెలిపే అనేక శిల్పాలు పొందుప‌ర్చారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు.

ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.

కళ్యాణ మండపం :

శ్రీ‌వారి గ‌ర్భాల‌యానికి దక్షిణంవైపు క్రీ.శ‌.1586లో శ్రీ అవ‌స‌రం చెన్న‌ప్ప అనే నాయ‌కుడు క‌ల్యాణ మండ‌పాన్ని నిర్మించారు. 80 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడ‌ల్పుతో 27 స్థంబాల‌తో నిర్మించారు. ఇందులో మ‌ధ్య‌ భాగంలో నాలుగు చిన్న స్తంభాలు ఉన్న గ్రానైట్ వేదిక ఉన్నాది. పూర్వ‌కాలంలో ఈ కల్యాణ వేదికపై శ్రీమలయప్పస్వామివారికి, శ్రీదేవి భూదేవిలకు కల్యాణోత్సవం నిర్వ‌హించేవార‌ని అర్చ‌కులు తెలిపారు.

ఆల‌యంలోని మండపాల‌ శిల్ప సౌందర్యాన్ని భక్తులు తిలకించేలా టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేర‌కు తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఆధ్వ‌ర్యంలో చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా మొదటి దశలో రంగనాయకుల మండపంలో స్తంభాలపై ఉన్న శిల్పాల సహజ సౌందర్యం మరింత ఇనుమడించేలా ఎల్ఈడీ స్పాట్ లైట్లను అమర్చారు. గోడ పైకప్పు వద్ద గోడకు ఉన్న శిల్పాలు ఆకర్షణీయంగా కనిపించేలా ఎల్ఈడీ స్ట్రిప్ లతో లీనియర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆల‌యంలోని అద్దాల మండపం, కల్యాణమండపం తదితర ప్రాంతాలలో దశల వారీగా ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.