SRIVARI ANNUAL BRAHMOTSAVAM POSTERS RELEASED_ శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Tirupati, 20 Sep. 19: The annual nine-day Brahmotsavams of Sri Venkateswara Swamy at Tirumala was released by TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri Anil Kumar Singhal.

The poster release event took place at Sri Padmavathi Rest House in Tirupati on Friday. Later speaking on this occasion, the Chairman said, elaborate arrangements are underway for the Navahnika Brahmotsavams which will be observed from September 30 till October 8 in Tirumala.

Every year the annual brahmotsavams are observed in a big way with religious fervour and grandeur. “We will be inviting the Honourable CM Sri YS Jaganmohan Reddy for this mega festival on September 21 at his office in Vijayawada. The Honourable CM will present silk vastrams to Sri Venkateswara Swamy on behalf of the state government, on the first day on September 30 as per the practice. The devotees all over from the country are invited to take part in this grand nine day festival”, he maintained.

Special Officer of Tirumala Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jatti were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

తిరుపతి, 2019 సెప్టెంబరు 20: తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్సవాల‌ గోడపత్రికలను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్ క‌లిసి ఆవిష్కరించారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతిగృహంలో శుక్ర‌వారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సంద‌ర్భంగా టిటిడి ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 30 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వరకు శ్రీవారి న‌వాహ్నిక బ్రహ్మోత్సవాలను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. తిరుమ‌ల‌లో సంవ‌త్స‌రం పొడ‌వునా నిర్వ‌హించే ఉత్స‌వాల్లో బ్ర‌హ్మోత్స‌వాలు ముఖ్య‌మైన‌వ‌ని చెప్పారు. సెప్టెంబ‌రు 21న విజ‌య‌వాడ‌కు వెళ్లి రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ.శ్రీ‌.వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆహ్వానిస్తామ‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల మొదటిరోజైన సెప్టెంబ‌రు 30న రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున గౌ..ముఖ్య‌మంత్రివ‌ర్యులు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని వెల్ల‌డించారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసి స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.