MANTRALAYA PEETHADHIPATHI VISITS SEVA SADAN AND ANNAPRASADAM COMPLEX _ శ్రీవారి సేవా సదన్ మరియు అన్నప్రసాదం కాంప్లెక్స్‌ను సందర్శించిన మంత్రాలయ పీఠాధిపతి

LAUDS THE IMPECCABLE SERVICES OF SRIVARI SEVAKS

 

TIRUMALA, 12 NOVEMBER 2022: The Pontiff of Sri Raghavendra Swamy Mutt in Mantralaya, HH Sri Sri Sri Subudendra Thirtha paved a visit to Srivari Seva Sadan 2 in Tirumala on Saturday evening and offered Anugraha Bhashanam to the Srivari Sevaks.

 

During his Anugraha Bhashana, he lauded the dedicated services of Srivari Sevaks to the fellow pilgrims. He said, it is great to know that Srivari Seva which was started about 22 years ago by TTD has so far witnessed the impeccable services of nearly 13lakh devotees who registered from various places across the country as volunteers. 

 

The Swamiji also said, great devotees like Annamayya, Tyagayya, Purandara Dasa, Vengamamba and others attained salvation in the service of Sri Venkateswara. “There is a saying in Kannada that in Kaliyuga among deities it is Sri Venkateswara and among Saints it is Guru Raghavendra who are worshipped and revered by devotees. That is why when Tirumala witnesses a pilgrim turn out of a lakh every day, in Mantralaya nearly 65thousand devotees throng every day”, he maintained.

 

“To cope up with the pilgrim rush, we are contemplating to start a voluntary service on the lines of Srivari Seva in the name “Gurupada Seva” in Mantralaya also. I whole-heartedly appreciate the commendable services of Srivari Sevaks who throng from different places, leaving their families and friends, to render services to their fellow pilgrims”, he added.

 

Earlier, the Pontiff along with his disciples observed the registration process, allotment of accommodation, duties to Srivari Seva volunteers, Cashew split seva etc.

 

Later the Pontiff also visited Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex and observed the serving of Annaprasadam to devotees, storage of vegetables, preparation of delicacies, automatic vegetable cutting machine and also interacted with devotees. The devotees also expressed immense satisfaction over the taste and hygiene of Annaprasadam being served in the Complex.

 

VGO Sri Bali Reddy, OSD Catering Sri GLN Sastry, AEO Annaprasadam Sri Gopinath, APRO Kum. Neelima, Co-ordinator Srivari Seva Sri Sridhar and others were also present.

 

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీవారి సేవా సదన్ మరియు అన్నప్రసాదం కాంప్లెక్స్‌ను సందర్శించిన మంత్రాలయ పీఠాధిపతి

– శ్రీవారి సేవకుల సేవలు అద్భుతం

తిరుమల‌, 2022 నవంబరు 12: మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి శనివారం సాయంత్రం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2ని సందర్శించి శ్రీవారి సేవకులకు అనుగ్రహ భాషణం అందించారు.

స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీవారి సేవకులు అంకితభావంతో చేస్తున్న సేవలను కొనియాడారు. సుమారు 22 ఏళ్ల క్రితం టీటీడీ ప్రారంభించిన శ్రీవారి సేవలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సేవకులుగా పేరు నమోదు చేసుకున్న దాదాపు 13 లక్షల మంది భక్తులు తమ నిష్కళంకమైన సేవలను అందించినట్లు తెలుసుకోవడం గొప్ప విషయమన్నారు.

శ్రీ అన్నమయ్య, శ్రీ త్యాగయ్య, శ్రీ పురందర దాసు, శ్రీ వెంగమాంబ వంటి గొప్ప భక్తులు శ్రీవేంకటేశ్వరుని సేవలో మోక్షాన్ని పొందారని స్వామీజీ అన్నారు. “కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, ప్రత్యక్ష గురువుగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారు భక్తులచే పూజింపబడుతున్నట్లు తెలిపారు.

ప్రతిరోజు తిరుమలకు లక్ష మందికి పైగా భక్తులు వస్తున్నారని, అదేవిధంగా మంత్రాలయానికి కూడా 65 వేల మంది భక్తులు వస్తున్నట్లు తెలిపారు.

యాత్రికుల రద్దీకి అనుగుణంగా మంత్రాలయంలో కూడా శ్రీవారి సేవ తరహాలో గురుపాద సేవ పేరుతో స్వచ్ఛంద సేవను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వారి తోటి యాత్రికులకు సేవలు అందించడానికి, వారి కుటుంబాలు మరియు స్నేహితులను విడిచిపెట్టి వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న శ్రీవారి సేవకులు అంకిత భావంతో చేస్తున్న సేవలను స్వామీజీ హృదయపూర్వకంగా అభినందించారు.

అంతకుముందు, స్వామీజీ తన శిష్యులతో కలిసి శ్రీవారి సేవకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వసతి, శ్రీవారి సేవా వాలంటీర్లకు విధుల కేటాయింపు,
జీడిపప్పు స్ప్లిట్ సేవ మొదలైన వాటిని పరిశీలించారు.

అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌ను సందర్శించి అన్న ప్రసాదాల తయారీ, భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించడం, కూరగాయల నిల్వ, కూరగాయాలు జరిగే యంత్రాన్ని పరిశీలించారు. అనంతరం టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదంపై స్వామీజీ ముఖాముఖి భక్తుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అన్న ప్రసాదంపై భక్తులు
సంతృప్తిని వ్యక్తం చేశారు.

విజివో శ్రీ బాలిరెడ్డి, అన్న ప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ జీఎల్‌ఎన్‌ శాస్త్రి, అన్నప్రసాదం
ఏఈవో శ్రీ గోపీనాథ్‌, ఏపీఆర్వో కుమారి పి.నీలిమ శ్రీవారి సేవా కో-ఆర్డినేటర్‌ శ్రీ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.