MANTRALAYA PONTIFF COMMENDS THE PARUVETA MANDAPAM RENOVATION _ పార్వేటి మండపం పునరుద్ధరణను అభినందించిన మంత్రాలయ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి

Tirumala, 22 November 2023: Mantralaya Pontiff Sri Sri Subudendra Theertha Swamy on Wednesday commended the rejuvenation of the dilapidated Paruveta Mandapam by TTD keeping in view the convenience of devotees.

After a visit to the centuries-old Mandapam built during the period of Saint Poet Sri Tallapaka Annamacharya, the pontiff said the purpose of his visit was to personally assess the historic and holy Mandapam after the criticism on its renovation by TTD.

He said the sight of the Mandapam reminded him of its spiritual glory and said heaping unprincipled and wayward criticism on TTDs developmental activities is not a correct practice.

The Pontiff also complimented the TTD Trust Board and the EO Sri AV Dharma Reddy for undertaking such constructive and crucial development activities in the larger interests of the pilgrims.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పార్వేటి మండపం పునరుద్ధరణను అభినందించిన మంత్రాలయ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి

తిరుమల, 2023 న‌వంబ‌రు 22: భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శిథిలావస్థలో ఉన్న పార్వేటి మండపాన్ని పునర్ నిర్మించి పూర్వవైభవాన్ని తీసుకువచ్చిన టీటీడీని మంత్రాలయ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి కొనియాడారు.

పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల కాలంలో నిర్మించిన శతాబ్దాల నాటి మండపాన్ని బుధవారం ఆయన సందర్శించారు.

అనంతరం స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ,పార్వేటి మండపం పునరుద్ధరణపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మండపాని చూడగానే కొత్త ప్రపంచాని చూసిన భావన కలిగిందన్నారు.

జీర్ణోద్దారణ చేసిన మండపంపై విమర్శలు చెయ్యడం సబబు కాదన్నారు. మంత్రాలయంలో కూడా 400 సంవత్సరాల క్రితం నిర్మించిన మండపాలను కూడా పున:రుద్దరణ చేశామన్నారు. టీటీడీలో జరిగే అభివృద్ధి పనులపై విమర్శలు చెయ్యడం మంచి పద్దతి కాదన్నారు.

మండపాన్ని చూడగానే ఆధ్యాత్మిక వైభవం గుర్తుకు వచ్చిందని, భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, పాలకమండలిని, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డిని స్వామీజీ అభినందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.