MARMA AYURVEDA THERAPY TO PREVENT DISEASES – EXPERT _ మర్మ చికిత్సతో అన్ని రకాల వ్యాధులను దూరం చేయవచ్చు : వంశపారంపర్య మర్మ చికిత్స వైద్యులు శ్రీ రమేష్

TIRUPATI,  25 JANUARY 2023: Marma Ayurveda Therapy is performed to prevent many diseases said expert Hereditary Marma Therapist Dr Ramesh.

Bengaluru based Trans Disciplinary Medical Varsity Professor Dr Ramesh explained about this ancient Therapy in Ayurveda at SV Ayurveda College in Tirupati on Wednesday.

Principal Dr Muralikrishna, Professors Dr Renu Dixit, Dr Srinivasa Kumar, other faculty, students were present.                                                   

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మర్మ చికిత్సతో అన్ని రకాల వ్యాధులను దూరం చేయవచ్చు : వంశపారంపర్య మర్మ చికిత్స వైద్యులు శ్రీ రమేష్

తిరుపతి, 2023 జనవరి 25: మర్మ చికిత్సతో శరీరంలోని అనేక రకాల వ్యాధులను, నొప్పులను దూరం చేయవచ్చని వంశపారంపర్య మర్మ చికిత్స వైద్యులు మరియు బెంగుళూరుకు చెందిన ట్రాన్స్ డిసిప్లినరీ విశ్వవిద్యాలయం అధ్యాపకులు శ్రీ రమేష్ తెలిపారు. తిరుపతి ఎస్వి ఆయుర్వేద కళాశాలలో బుధవారం మర్మ చికిత్స విధానంపై ప్రయోగాత్మకంగా వివరించారు.

ఈ సందర్భంగా శ్రీ రమేష్ “మర్మ చికిత్స – ఏ ఏ వ్యాధులలో ఉపయోగించాలి” అనే అంశంపై ప్రసంగిస్తూ, మన శరీరంలో 107 ప్రత్యేక సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయని, వాటిని గుర్తించి వాటిపై తగినంత ఒత్తిడి కలిగించడం ద్వారా అనేక రకాల వ్యాధులను నయం చేయవచ్చు అని చెప్పారు. వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్న రోగులకు మర్మ చికిత్స ద్వారా తక్షణమే నొప్పి నివారణ అందించవచ్చని తెలిపారు.

ఎటువంటి ఔషధం లేకుండా కేవలం మర్మ ప్రత్యేక స్థానాలపై ఒత్తిడి కలిగించి, వ్యాధులను నివారించే ఈ చికిత్స విధానము చాలా ప్రాచీనమైనదని ఆయుర్వేద మరియు సిద్ద వైద్య గ్రంథాలలో వివరించబడినట్లు చెప్పారు. దేశ విదేశాలలో మర్మ చికిత్స అత్యంత ప్రాచుర్యం పొందిందని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, ఆధ్యాపకులు డాక్టర్ రేణు దీక్షిత్, డాక్టర్ శ్రీనివాస్ కుమార్, ఇతర అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.