MASS CLEANING OF TIRUMALA GHATS AND FOOTPATHS ON MAY 13 _ మే 13న తిరుమల మార్గాల్లో “శుద్ధ తిరుమల – సుందర తిరుమల”

PLASTIC FREE TIRUMALA IS MOTTO-TTD EO

FORMER CJI, COLLECTOR, SP ALSO TO TAKE PART 

TIRUPATI, 11 MAY 2023: As part of the mass cleaning programme of both the Tirumala Ghat Roads and footpath routes mulled by TTD on May 13, besides the TTD workforce, district administration will also take part in the “Plastic-free” programme, said TTD EO Sri AV Dharma Reddy.

During a review meeting held at Sri Padmavathi Rest House in Tirupati on Thursday with the deputed officials to the mass cleaning programme, the EO said, the motto is to make Tirumala plastic free. Former Chief Justice of India Justice NV Ramana is also participating in the event apart from District Collector Sri Venkatramana Reddy, SP Sri Parameshwar Reddy, AP Swachandra Corporation Advisor Dr Jayaprakash Sai and others he added.

Earlier, SE 2 Sri Jagadeeshwar Reddy explained the EO about the detailed plan of action with the help of PowerPoint Presentation. He enlisted the Incharge officers at various places in Up Ghat, Down Ghat roads, Alipiri and Srivarimettu footpath routes along with the details of supporting staff, srivari sevaks etc.

EO called upon all the officials to participate in the mission with dedication and set an example to others in this programme aimed at making Tirumala – a Plastic-free Zone. “The devotees should also get enlightened about the importance of making Tirumala an environment-friendly zone and completely avoid bringing plastic bottles and non-degradable plastics to Tirumala with this mega cleaning programme”, he asserted.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CEO SVBC Sri Shanmukh Kumar, DLO Sri Veeraju, FACAO Sri Balaji, HO Dr Sridevi, other deputation officials etc.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

మే 13న తిరుమల మార్గాల్లో “శుద్ధ తిరుమల – సుందర తిరుమల”

– ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తాం

– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుపతి, 2023 మే 11: తిరుమల రెండు ఘాట్‌ రోడ్లు, రెండు నడకదారుల్లో మే 13న శనివారం టిటిడి ఉద్యోగులతో సామూహికంగా “శుద్ధ తిరుమల – సుందర తిరుమల” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణపై తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మొదటి ఘాట్‌ రోడ్డు(18 కి.మీ)ను 7 సెక్టార్లు, రెండో ఘాట్‌ రోడ్డు(18 కి.మీ)ను 6 సెక్టార్లు, అలిపిరి నడకమార్గాన్ని(8 కి.మీ) 7 సెక్టార్లు, శ్రీవారి మెట్టు మార్గాన్ని(3 కి.మీ) 5 సెక్టార్లుగా విభజించి ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలను తొలగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ, జిల్లా కలెక్టర్‌ శ్రీ వెంకటరమణారెడ్డి, ఎస్పీ శ్రీ పరమేశ్వర్‌రెడ్డి, ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ సలహాదారు డాక్టర్‌ జయప్రకాశ్‌ సాయి తదితరులు పాల్గొంటున్నారని చెప్పారు. టిటిడి ఉద్యోగులతోపాటు తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌, తిరుపతి కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ సిబ్బంది, న్యాయశాఖ అధికారులు తదితరులు స్వచ్ఛందంగా పాల్గొంటారని వివరించారు.

అంతకుముందు, ఎస్‌ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండు ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో ఇన్‌చార్జి అధికారులతో పాటు సహాయక సిబ్బంది, శ్రీవారి సేవకుల వివరాలను తెలియజేశారు. తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులందరూ అంకితభావంతో పాల్గొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఈవో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో తిరుమలను పర్యావరణహితంగా మార్చడంపై భక్తులకు అవగాహన కల్పించాలని, తిరుమలకు ప్లాస్టిక్ బాటిళ్లు, నాన్ డిగ్రేడబుల్ ప్లాస్టిక్‌ను తీసుకురావడాన్ని పూర్తిగా నివారించాలని ఆయన కోరారు.

జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, డిఎల్వో శ్రీ వీర్రాజు, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజీ, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, ఇతర డెప్యుటేషన్ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.