HANUMAN JAYANTI FESTIVITIES FROM MAY 14-18 IN TIRUMALA _ మే 14 నుండి 18వ తేదీ వరకు తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు

TIRUPATI, 11 MAY 2023: The Hanuman Jayanti festivities will be observed between May 14-18 in a big manner in Tirumala.

Reviewing on the same with Pundita Mandali, at Sri Padmavathi Rest House in Tirupati on Thursday, the EO said, TTD has declared Anjanadri in Tirumala as the birth place of Sri Hanuman with Pouranic, Geological, Epigraphical, Scientific evidences. Still if anyone has any doubts regarding the birth place of Sri Hanuman, the Pundita Mandali constituted by TTD is ready to clear them with evidence, he asserted. “Even the evidences are available in TTD website in different languages for the sake of devotees”, he added.  

TTD is gearing up to host the event in a big way at five different places in Tirumala including Bedi Anjaneya Swamy, Nada Neerajanam, Anjanadri Akasaganga, Japali and Dharmagiri. Each day there will be religious discourse by one Pontiff who will be gracing the event.

JEO for Health and Education Smt Sada Bhargavi, CEO SVBC Sri Shanmukh Kumar, Vice Chancellor of Sri Venkateswara Vedic University Sri Ranisadasiva Murthy, Annamacharya Project Director Dr Vibhishana Sharma, National Sanskrit University PRO Sri Raghavan and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

మే 14 నుండి 18వ తేదీ వరకు తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు

– ప్రతిరోజు ప్రముఖ పీఠాధిపతుల అనుగ్రహభాషణం

– మే 16న ధర్మగిరిలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం

తిరుమల, 2023 మే 11: తిరుమలలో మే 14 నుండి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో గురువారం
ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, అంజనాద్రి ఆకాశ గంగ, జపాలి, నాదనీరాజన వేదిక, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతి రోజు పీఠాధిపతులు అనుగ్రహభాషణం ఇవ్వనున్నట్లు చెప్పారు.

తిరుమల వేద విజ్ఞాన పీఠంలో ఉద‌యం 6 నుండి రాత్రి 11 గంటల వ‌ర‌కు దాదాపు 18 గంట‌ల పాటు 67 మంది ప్రముఖ పండితులు ఈ అఖండ పారాయణ యజ్ఞాన్ని నిర్వహిస్తారని చెప్పారు. ఈ మొత్తం కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుందని, విజయానికి ప్రతీక అయిన సుందరకాండ పరాయణంలో ప్రజలందరూ తమ ఇళ్ల వద్ద నుండే పరాయణంలో పాల్గొనాలని ఆయన కోరారు.

అదేవిధంగా ఆంజనేయుని జన్మస్థలంపై ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉంటే ఇప్పటికే టీటీడీ అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని టీటీడీ పండితమండలి పౌరాణిక, చారిత్రక, భౌగోళిక సాక్షాదారాలతో పాటు ధ్రువీకరించిందని, ఇందుకు సంబంధించిన వివరాలను కూడా టిటిడి అధికారిక వెబ్సైట్లో వివిధ భాషల్లో పొందుపరచడం జరిగిందని తెలిపారు.

ఈ విషయం పైన ఎవరికైనా సందేహాలు, అనుమానాలు ఉంటే వాటి నివృత్తికి టీటీడీ పండితమండలి వద్ద పౌరాణిక సమాధానాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్‌విబిసి సిఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్, ఎస్‌వివియు విసి శ్రీ రాణిసదాశివమూర్తి, ఎన్‌ఎస్‌యు పిఆర్ ఓ శ్రీ రంగరాజన్, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ విభీషణ శర్మ, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.