Mass satyanarayana Swamy Vratam on August 1 at Mylavaram _ ఆగస్టు 1న మైలవరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

Tirupati,29 July 2023: Under the aegis of its HDPP wing, TTD is organising a mass Satyanarayana Swami Vratam on August 1 between 9.00 am to 1pm at Mylavaram town in the NTR district of Andhra Pradesh.

Legends say that performing such Vratam on Ekadasi or Pournami day in the months of Vishakha, Magha and Karthika brings prosperity.

Interested couples shall contact 9000947974, 9398418266 for more details.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 1న మైలవరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

తిరుపతి, 29 జూలై 2023: టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని శ్రీ కోదండ రామాలయంలో ఆగస్టు 1న ఉదయం 9 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు.

వైశాఖ, మాఘ, కార్తీక మాసాల్లో ఏకాదశి, పౌర్ణమి నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన విశేష శుభ ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనదలచిన గృహస్తులు 9000947974, 9398418266ను సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.