MASTER PLAN FOR VONTIMITTA BY MAY-TIRUPATI JEO_ ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్

Vontimitta, 14 April 2018: The master plan for Vontimitta will get ready by May end said Tirupati JEO Sri P Bhaskar.

A review meeting was held at PAC in Vontimitta in Kadapa district on Saturday along with district collector Sri Babu Rao Naidu and infrastructure officers.

Speaking on this occasion the JEO said agency will be finalized by May end. After that both TTD and district administration will take up the works under their purview. Already after taking permission from Archaeological Survey of India we have so far completed Rs.12cr works in Vontimitta.

He also said to propagate Ramayanam, a project called Sri Ramanujacharya will be taken up soon. TTD is contemplating permanent structure at Kalyana Vedika so that it will be useful for both TTD activities and district administration, JEO added.

Urban Infrastructure CEO Sri Prakash Hour, RDO Sri Veera brahmam, DyEO Smt Goutami , AEO Sri Ramaraju were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్

ఒంటిమిట్ట, 2018 ఏప్రిల్ 14: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కడప జిల్లా యంత్రాంగంతో కలసి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్ తెలిపారు. ఒంటిమిట్టలోని పిఎసిలో శనివారం సాయంత్రం కడప జిల్లా కలెక్టర్ శ్రీ బాబురావు నాయుడు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికారులు, ఇతర అధికారులతో జెఈఓ సమావేశమయ్యారు.

సమావేశం అనంతరం జెఈఓ మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఏజెన్సీని ఖరారు చేసి మే 31లోపు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. ఆ తరువాత టిటిడి, జిల్లా యంత్రాంగం తమ పరిధిలోని పనులను చేపడతాయన్నారు. ఆర్కియాలజి సర్వే ఆఫ్ ఇండియా అనుమతితో ఇప్పటికే శ్రీ కోదండరామాలయం వద్ద రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. రామాయణం సారాంశం భక్తులకు సులువుగా అర్థమయ్యేలా “శ్రీరామం” ప్రాజెక్టును చేపట్టేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. కల్యాణవేదిక వద్ద శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టి టిటిడికి, జిల్లా యంత్రాంగానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు.

ఈ సమావేశంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిఈఓ శ్రీ ప్రకాష్ గౌర్, టిడ్కో వైస్ ఛైర్మన్ శ్రీ రామనాథ్, రాజంపేట ఆర్డీవో శ్రీ వీరబ్రహ్మం, టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, డెప్యూటి ఈఓ శ్రీమతి గౌతమి, ఎఇఓ శ్రీ రామరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.