MECHANISATION OF LUGGAGE DELIVERY FOR PEDESTRIAN PILGRIMS_ యాంత్రికరణ ద్వారా నడక మార్గాల్లో భక్తుల లగేజీ డెలివరీ మరింత సులభతరం – టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి

MECHANISATION OF LUGGAGE DELIVERY FOR PEDESTRIAN PILGRIMS

 

TIRUMALA, 19 APRIL 2023: The luggage delivery system should be made pilgrim friendly for the devotees trekking both footpaths, said TTD EO Sri AV Dharma Reddy.

 

Reviewing on the same in his chambers in TTD Administrative Building in Tirupati on Wednesday the EO directed the officials concerned to do a survey on the functioning of luggage delivery counters at KKC and Supadham which are being operated through a computer app specially designed for this.

 

On necessity, he instructed to increase the luggage delivery centres and put an electronic display about the details of luggage etc.

 

Earlier the vigilance officials have explained the luggage deposit, transport and delivery mechanism through power point presentation. The EO directed some changes and made some suggestions and asked the vigilance sleuths to come up with a detailed PP presentation next week.

 

CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, FACAO Sri Balaji, CAuO Sri Sesha Sailendra, GM IT Sri Sandeep Reddy, VGO Vigilance Sri Girishar Rao and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

యాంత్రికరణ ద్వారా నడక మార్గాల్లో భక్తుల లగేజీ డెలివరీ మరింత సులభతరం – టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి

తిరుపతి, 2023 ఏప్రిల్ 19: తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా నడిచి వెళ్లే భక్తుల లగేజీని మరింత సులభంగా తిరుమలలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో బుధవారం ఆయన లగేజీ యాంత్రికరణ ద్వారా రవాణా, డెలివరీ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రెండు నడక మార్గాల్లో భక్తులు భద్రపరిచిన లగేజి సామర్థ్యాన్ని పెంచేందుకు యాంత్రికరణను చేస్తూ త్వరితగతిన మరింత సులభంగా అందించాలన్నారు. తిరుమలలో భక్తులు లగేజి తీసుకోవడానికి అవసరమైన డెలివరీ కేంద్రాల సంఖ్య పెంచాలన్నారు. ప్రస్తుతం కంప్యూటర్ అప్లికేషన్ తో ప్రయోగాత్మకంగా పనిచేస్తున్న కేకేసి, సుపథం కేంద్రాల వద్ద రోజువారి లగేజీ డెలివరీల సంఖ్య, భక్తుల నుండి అభిప్రాయ సేకరణ తీసుకోవాలన్నారు.

లగేజి డెలివరీ కేంద్రాల సంఖ్య మరింత పెంచిన తర్వాత అక్కడ అవసరమైన లగేజీ బ్యాగుల నెంబరు, బార్ కోడ్ నెంబరు తదితర అంశాలు కనిపించేలా ఎలక్ట్రానిక్ సమాచార ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లగేజి డెలివరీ కేంద్రాల్లో అవసరమైనన్ని ట్రాలీలు ఏర్పాటు చేయాలని, సివిల్ పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కౌంటర్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు.

ఈ సందర్భంగా ఈవో లగేజీ కౌంటర్ల వద్ద డిపాజిట్, రవాణా, డెలివరీ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన (పిపిటి) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పరిశీలించి పలు సూచనలు, మార్పులు చేశారు. వచ్చేవారం పూర్తిస్థాయిలో దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.

సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ , సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎఫ్ ఏ అండ్ సి ఏ ఓ శ్రీ బాలాజీ, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేషశైలేంద్ర, జిఎం (రవాణా) శ్రీ శేషారెడ్డి, జిఎం (ఐటి) సందీప్ రెడ్డి, విజిఓ శ్రీ గిరిధర్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.