SITE NOTIFIED FOR MANUSCRIPTS BUILDING_ తాళపత్ర గ్రంథాల భద్రత భవన నిర్మాణానికి స్థల పరిశీలన
TIRUPATI, 19 APRIL 2023: Towards the construction of an exclusive building for Manuscripts Project in SV Vedic University, JEO(H&E) Smt Sada Bhargavi held a field inspection in the varsity premises on Wednesday.
The Sanatana Jeevana Trust has come forward to construct the building. A vacant site located behind Research Building has been notified in the preliminary inspection.
VC Sri Ranisadasiva Murty, CE Sri Nageswara Rao, Manuscripts DyEO Smt Vijayalakshmi, Estates Wing Special Officer Sri Mallikharjuna, Registrar Sri Radhe Syam and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తాళపత్ర గ్రంథాల భద్రత భవన నిర్మాణానికి స్థల పరిశీలన
తిరుపతి 19 ఏప్రిల్ 2023: తాళపత్ర గ్రంథాలు భద్రపరచడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న భవన నిర్మాణానికి బుధవారం సాయంత్రం అధికారులు స్థల పరిశీలన చేశారు.
జేఈవో శ్రీమతి సదా భార్గవి ఆధ్వర్యంలో అధికారుల బృందం వేద విశ్వవిద్యాలయం లో స్థలాన్ని పరిశీలించారు. పరిశోధన భవనం వెనుకవైపున ఉన్న ఖాళీ స్థలం ఈ భవన నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ణయించారు.
పురావస్తు శాఖ, ఎస్వీ యూనివర్సిటీ వద్ద ఉన్న పురాతన తాళ పత్ర గ్రంథాలను డిజిటైజ్ చేసి భావితరాలకు అందుబాటులో ఉంచాలని టీటీడీ మ్యాన్ స్క్రిప్ట్స్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్కాన్ చేసిన తాళ పత్రాలను మరో 500 సంవత్సరాలు గడచినా చెక్కు చెదరకుండా ఉండేలా భద్రపరచడానికి టీటీడీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సనాతన జీవన ట్రస్ట్ ఈ భవన నిర్మాణానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో అధికారులు స్థల పరిశీలన జరిపారు.
వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్టేట్ విభాగం ఓఎస్డీ శ్రీ మల్లిఖార్జున, వర్సిటీ రిజిస్ట్రార్ శ్రీ రాధేశ్యాం తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది