Meeting on Recruitments in TTD with Dist Officials _ సెప్టెంబర్ 26న టిటిడి ఉద్యోగాల‌కు వ్రాత ప‌రీక్ష‌

Tirupati, August 6: The Tirumala Tirupati Devasthanams (TTD) Executive Officer Sri.I.Y.R. Krishna Rao said that the written tests for the all category of vacancies in the TTD will be conducted on September 29 at the 93 identified centers in and around of Tirupati.

 He said 1,12,462 applications received from the candidates through online for 186 vacancies  in five different categories  of which 77,186 candidates only paid the amount towards application fee and the tests comprising of objective type questions  related to their Analytical ability, , mathematical Ability, Logical Reasoning, Knowledge in English and Telugh and in General Knowledge, the Executive officer said.

 He said the tests will be conducted in a transparent and vigilant manner and the test duration was two hours in two sessions .The first session will be held from 1100 hours to 1300 hours for Jr.Assistant post category while the second session will be held from 1500 hours to 1700 hours for the remaining category posts, he said.

The EO said there will be   no negative marking and the candidates have to darken the circle with HB pencil against an option considered correct for every question in the Answer sheet during the examination as the answer sheet will be read by OMR machine, he added.

Earlier, the Executive officer conducted a review meeting on conduction of the examinations and arrangements with 13 officials including district collector Sri V.Seshadri, district superintendent of police Sri. .Ramakrishna, RDO Sri. .Prasad, TTDs Joint Executive officer Dr.N.Yuvraj and Tirupati Municipal Corporation Commissioner Mrs.Janaki.

ISSUED BY THE OFFICE OF PRO, TTDS, AND TIRUPATI.

 

సెప్టెంబర్ 26న టిటిడి ఉద్యోగాల‌కు వ్రాత ప‌రీక్ష‌

తిరుపతి, 2010 ఆగష్టు 06: తిరుమల తిరుపతి దేవస్థానములలో ఉద్యోగాల భర్తీకై ఇటీవల ప్రకటించిన ఉద్యోగ ఖాళీలకు సెప్టెంబర్‌ 26వ తేదిన తిరుప‌తిలో వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తితిదే కార్యనిర్వహణ అధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు తెలిపారు.
 
శుక్రవారం స్థానిక శ్వేత భవనంలో పరీక్ష నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో తితిదే అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ తితిదే ఇటీవల 186 పోస్టులను ప్రకటించగా 1,12,463 దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చాయని తెలిపారు. ఇందులో 60 వేల మంది జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హత సాధించగా, టైపిస్టు, ఎల్‌.డి.స్టెనో, యు.డి.స్టెనో, షరాబు / అసిస్టెంట్‌ పోస్టులకుగాను 17,186 మంది అర్హత సాధించారు. వీరికి సెప్టెంబర్‌ 26వ తేదిన తిరుపతిలోని 93 సెంటర్లలో వ్రాత పరీక్ష వుంటుందని తెలిపారు. వ్రాత పరీక్ష అబ్జెక్టివ్‌ పద్దతిలో వుంటుందని  పేర్కొన్నారు.

జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉదయం 11 నుంచి మధ్యాహ్న 1 గంట వరకు, మిగిలిన పోస్టులకు మధ్యాహ్నం 3 గంటలకనుండి సాయంత్రం 5 గంటల వరకు వ్రాత పరీక్ష వుంటుంది. వ్రాత పరీక్షకు హాజరయ్యేవారు ప్యాడ్‌ (అట్ట) తెచ్చుకోవాలి.

ఈ సందర్భంగా అభ్యర్థుల సౌకర్యార్థం అదనపు బస్సులు, సిటీ బస్సులను ఏర్పాటు చేయాలని ఆయన ఆర్‌.టి.సి. అధికారులను కోరారు. అదే విధంగా ఆ రోజున ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. అదే విధంగా పరీక్ష నిర్వహణలో జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరించాలని ఆయన అధికారులను కోరారు.  

వ్రాత పరీక్ష వ్రాయడానికి వచ్చే అభ్యర్థులకు తగిన సమాచారం అందించడానికి తిరుపతి రైల్వే, బస్‌స్టేషన్‌లలో సమాచార కేంద్రాలతో పాటు డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తారు.

ఈ కార్యక్రమంలో తితిదే జె.ఇ.ఓ. శ్రీ ఎన్‌. యువరాజ్‌, సి.వి.&ఎస్‌.ఓ ఎం.కె.సింగ్‌, జిల్లా ఎస్‌.పి. రామకృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ ప్రద్యుమ్న, తిరుపతి నగరపాలక కమీషనర్‌ జానకి, ఆర్‌.టి.సి. ఆర్‌.ఎం. సూర్యప్రకాశరావు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, తితిదే ఉన్నత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.