MEMBER TAKES OATH AS TTD SPECIFIED AUTHORITY MEMBER _ టీటీడీ సాధికారిక మండలి సభ్యులు శ్రీ కె.కన్నబాబు ప్రమాణస్వీకారం
Tirumala, 07 November 2026: Sri K. Kannababu, Secretary to Govt., Revenue (Endowments) Dept., (FAC), took oath as a member of the TTD Specified Authority on Saturday in Srivari Temple.
The oath-taking ceremony was held at the Bangaru Vakili inside the Srivari Temple in Tirumala.
The TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary administered the oath.
Later, Vedic scholars offered Veda Ashirvachanam to Sri K. Kannababu at the Ranganayakula Mandapam and the Additional EO presented him with Srivari Teertha Prasadams.
Speaking to the media in front of the temple on this occasion, Sri K. Kannababu said that he considered the opportunity to serve as a member of the TTD Specified Authority a divine blessing bestowed by Sri Venkateswara, the presiding deity of Kaliyuga.
He stated that he would strive to uphold the trust reposed in him by Hon’ble Chief Minister Sri N. Chandrababu Naidu, who appointed him as a member of the Specified Authority, and render his services to the best of his ability.
He further stated that under the leadership of the Chairman of the Specified Authority, he would work with utmost devotion and dedication to promote the religious heritage and spiritual significance of the Srivari Temple across the world.
Srivari Temple Dy EO Sri Bhaskar, Board Cell Dy EO Smt. Prashanti and other officials were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీ సాధికారిక మండలి సభ్యులు శ్రీ కె.కన్నబాబు ప్రమాణస్వీకారం
తిరుమల, 2026 నవంబర్ 07: టీటీడీ సాధికారిక మండలి సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ సెక్రటరీ (ఎఫ్ఏసీ) శ్రీ కె.కన్నబాబు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో శ్రీ కె.కన్నబాబు మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామివారి పిలుపు, అనుగ్రహంతో తనకు ఈ గొప్ప అవకాశం లభించిందని అన్నారు. తనపై విశ్వాసం ఉంచి సాధికారిక మండలి సభ్యుడిగా నియమించిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, తన శక్తిమేరకు పూర్తిస్థాయిలో సేవలందిస్తానని తెలిపారు.
సాధికారిక మండలి చైర్మన్ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ ధార్మికత, విశిష్టతను ఖండాంతరాలకు విస్తరించేలా భక్తిశ్రద్ధలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, బోర్డ్ సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.




