SRI KALYANA VENKATESWARA SWAMY PAVITROTSAVAMS CONCLUDE WITH PURNAHUTHI _ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
Tirupati, November 07, 2026: The three-day Pavitrotsavams at Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasa Mangapuram, concluded ceremoniously on Saturday with Purnahuti.
On the final day, Snapana Tirumanjanam was performed to the deities of Sri Kalyana Venkateswara Swamy along with Sridevi and Bhudevi, with milk, curd, honey, coconut water, turmeric and sandalwood.
The rituals concluded in the evening with Purnahuti, Kumbha Prokshana and honours to the Acharya.
Temple Deputy EO Varalakshmi, AEO Gopinath, temple staff, priests and a large number of devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి, నవంబరు 07, 2026: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారం పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి.
చివరి రోజు ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాలసేవ, కొలువు నిర్వహించారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాల తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేష అభిషేకం చేశారు.
సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభప్రోక్షణ నిర్వహించి, ఆచార్యులకు బహుమానం సమర్పించడంతో పవిత్రోత్సవాలు సంపూర్ణమయ్యాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్లు శ్రీ రాజ్ కుమార్, శ్రీ హరికృష్ణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




