METLOTSAVAM OBSERVED_ అన్నమయ్య 515వ వర్ధంతి సందర్భంగా అలిపిరిలో వైభవంగా మెట్లోత్సవం

Tirupati, 13 March 2018: On the occasion of 515th Death Anniversary of Saint Poet Tallapaka Annamacharya, Metlotsavam was observed with religious fervour at Alipiri Padala Mandapam on Tuesday.

The Sapthagiri Sankeertana Goshti Ganam was held and “Metla Puja” was Performed.

Successors of Annamaiah from Chennai, Smt TV Meenalochani and Sri Harinarayana from Tirumala rendered Annamacharya sankeertans.

Annamacharya Project Officer Sri Dhananjaya and others were present


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అన్నమయ్య 515వ వర్ధంతి సందర్భంగా అలిపిరిలో వైభవంగా మెట్లోత్సవం

మార్చి 13, తిరుపతి, 2018: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 515వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మంగళవారం ఉదయం టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరిగింది.

టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్ల కళాకారులు ఉదయం 6 గంటల నుంచి అన్నమాచార్యులవారి ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా మెట్లపూజ జరిగింది. అన్నమయ్య వంశీకులు చెన్నైకి చెందిన సర్వశ్రీ టి.వి.మీనాలోచన, తాళ్లపాకకు చెందిన శ్రీ హరినారాయణ ఆలపించిన ”బ్రహ్మకడిగిన పాదము…., భావములోన …, అదివో అల్లదివో…” తదితర కీర్తనలు ఆకట్టుకున్నాయి. మెట్లోత్సవం సందర్భంగా నిర్వహించిన కోలాటాలు , భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తరువాత కళాకారులు సంకీర్తనలు గానం చేస్తూ కాలినడకన తిరుమలకు వెళ్లారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భజన మండళ్ల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మార్చి 14 నుండి అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు :

అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా మార్చి 14 నుండి 16వ తేదీ వరకు సాహితీ సదస్సులు జరుగనున్నాయి. మార్చి 14న ఉదయం దినము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనలు గానం చేస్తారు. మార్చి 17న శ్రీగోవిందరాజస్వామివారి ఆస్థానం నిర్వహిస్తారు.

అదేవిధంగా, తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మార్చి 14 నుండి 17వ తేదీ వరకు సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు సంగీత సభలు జరుగనున్నాయి.

తాళ్లపాకలో :

అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా వారి స్వస్థలమైన కడప జిల్లా తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల విగ్రహం వద్ద మార్చి 14 నుండి 17వ తేదీ వరకు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మెట్లోత్సవం కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ సంచాలకులు శ్రీ ధనుంజయుడు, ఇతర అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.