SUB TEMPLES OBSERVE KOIL ALWAR TIRUMANJANAM_ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 13 March 2018: As the Vilambi Ugadi is just five days to go, the sub temples of TTD including Sri Govindaraja Swamy temple and Sri Kodandarama Swamy temple observed traditional temple cleansing fete “Koil Alwar Tirumanjanam” on Tuesday.

The temple staffs took part in this cleansing ritual with utmost devotion which lasted for over three hours.

Later the devotees were allowed for darshan.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2018 మార్చి 13: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఉగాదికి ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధి, శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీ ఆండాల్‌ అమ్మవారు, శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి, శ్రీ పుండరికవల్లీ ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ప్రధాన అర్చకులు శ్రీ ఏపీ శ్రీనివాస దీక్షితులు, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ సి.సురేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ప్రశాంత్‌, అర్చక బృందం పాల్గొన్నారు.

శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. మార్చి 16 నుండి 24వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల ముందు మంగళవారం నాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఎదురు ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ ఝాన్సీలక్ష్మీ, ప్రధాన అర్చకులు శ్రీఆనందకుమార దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇస్పెక్టర్లు శ్రీమురళీకృష్ణ, శ్రీ శేషారెడ్డి, అర్చక బృందం, సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.