METLOTSAVAM ON JUNE 30_ ”జూన్ 30న మెట్లోత్సవం”
”జూన్ 30న మెట్లోత్సవం”
తిరుపతి, జూన్-25, 2008: తి.తి.దే., అమృతోత్సవాలలో భాగంగా జూన్ 30వ తేది ఉదయం మెట్లోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు.
జూన్ 30వ తేది ఉదయం 7 గం||లకు అలిపిరి పాదాల మండపం నుండి మెట్లోత్సవం ప్రారంభం అవుతుంది. ఈ ఉత్సవంలో వేలాదిమంది భజన సంఘాలు, దాససాహిత్య మండలులు, అన్నమయ్య శరణాగతి మండలులు పాల్గొంటారు. వీరితోపాటు తి.తి.దే., పాలకమండలి ఛైర్మన్, సభ్యులు, కార్యనిర్వహణాధికారి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొంటారు.
ఈ మెట్లోత్సవంలో పాల్గొని నడకదారిన తిరుమలకు చేరుకున్న తరువాత ఆస్థానమండపంలో భక్తులతో సమావేశం జరుగుతుంది. ఈ మెట్లోత్సవంలో పాల్గొనే భక్తులందరికి ఉచితంగా స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తారు. అంతేగాక వీరికి లడ్డు ప్రసాదం, పుస్తకప్రసాదం అందజేస్తారు.
కనుక పురప్రజలు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు, భక్తులు వేలాదిగా ఈ మెట్లోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.