MINGLING AYUR WITH ASTRO WILL GIVE GOOD RESULTS-DR KSR PRASAD _ ఆయుర్వేదానికి జ్యోతిషాన్ని జోడిస్తే సత్ఫలితాలు: డాక్టర్ కెఎస్ఆర్.ప్రసాద్

TIRUPATI, 11 JULY 2022: By mingling Ayurveda with Astrology will yield good results said Dr KSR Prasad, the Principal of Mirzapur Ayurveda College, Uttar Pradesh.

He was giving a guest lecture on Ayur and Astro sciences and their proximity at SV Ayurveda college in Tirupati on Monday he said, both Ayurveda and Astrology originated from Vedas.

“If we mingle both these sciences miracles might happen on human health. We can promote resistance power. So Ayurvedic doctors are now choosing Medical Astrology and doing miracles in the area of health, he added.

He said in his 15 years of research, by mingling both, he could able to cure many diseases among children viz. Autism, cerebral palsy, down syndrome etc.

Principal of SV Ayurveda College Dr Muralikrishna, Vice-principal Dr Sundaram, Dr Harshavardan, students were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆయుర్వేదానికి జ్యోతిషాన్ని జోడిస్తే సత్ఫలితాలు : డాక్టర్ కెఎస్ఆర్.ప్రసాద్

తిరుపతి, 11 జూన్ 2022: ఆయుర్వేదానికి జ్యోతిషాన్ని జోడిస్తే సత్ఫలితాలు వస్తాయని, పలు వ్యాధుల చికిత్స సులభతరం అవుతుందని ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎస్ఆర్.ప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో సోమవారం సాయంత్రం ఆయుర్వేద శాస్త్రం మరియు జ్యోతిష్య సమన్వయం అనే అంశంపై ఆయన ప్రసంగించారు.

ఆయుర్వేదం, జ్యోతిష శాస్త్రాలు వేద సంస్కృతి నుండి ఉద్భవించాయని, మానవుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. ఆయుర్వేద వైద్యులు మెడికల్ ఆస్ట్రాలజీలో ప్రవేశం పొంది అవగాహన పెంచుకోవడం ద్వారా, దీర్ఘకాలిక వ్యాధులకు జ్యోతిష్య శాస్త్రంలో పొందుపరిచిన ఔషధాలను ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. తన 15 ఏళ్ల పరిశోధనలో ఆయుర్వేదానికి జ్యోతిషాన్ని జోడించడం ద్వారా చికిత్స సులభతరమైందన్నారు. చిన్నపిల్లల వ్యాధులలో ముఖ్యంగా ఆటిజం, బుద్ధి మాంద్యం, సెరిబ్రల్ పాల్సీ లాంటి వ్యాధులను ముందుగా నయం చేయడానికి జ్యోతిష శాస్త్రం బాగా ఉపయోగపడిందన్నారు. ఆయుర్వేద వైద్య విద్యార్థులు మెడికల్ ఆస్ట్రాలజీని అభ్యసించడం ద్వారా భవిష్యత్ వ్యాధులు అవగాహన, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సను సులువుగా తెలుసుకోవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరం, వైద్యులు డాక్టర్ హర్షవర్ధన్, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది