MINI KALYANA KATTA BEGINS AT SRINIVASA MANGAPURAM _ శ్రీనివాసమంగాపురంలో మినీ కల్యాణకట్ట ప్రారంభం
Tirupati, 13 Sep. 21: TTD has opened a mini Kalyana Katta at Srinivasa Mangapuram abode of ancient Sri Kalyana Venkateswara Swamy temple for the benefit of the devotees on Monday.
The TTD officials inaugurated the Kalyana Katta with the special pujas performed by a woman devotee.
The mini Kalyana Katta set up near the temple will benefit devotees to redeem their vow and offer tonsuring before embarking on their journey to Tirumala by the Srivari Mettu footpath.
Temple DyEO Smt Shanti, AEO Sri Dhananjayudu, Superintendent Sri Changalrayadu and other Archakas were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీనివాసమంగాపురంలో మినీ కల్యాణకట్ట ప్రారంభం
తిరుపతి, 2021 సెప్టెంబరు 13: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సోమవారం మినీ కల్యాణకట్టను ఆలయ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక భక్తురాలితో పూజ చేయించారు.
ఆలయంలోని కల్యాణమండపం పక్కన మినీ కల్యాణకట్టను ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు, శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించేందుకు అనువుగా ఉంటుంది. తలనీలాలు సమర్పించే భక్తుల కోసం ఇక్కడ స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయలు, అర్చకస్వాములు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.