MOCK “HUNTING FESTIVAL” OBSERVED IN SRINIVASA MANGAPURAM _ వైభవంగా శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం

WE ARE CONTEMPLATING KARTHIKA VANABHOJANAM SOON-TIRUPATI JEO

Tirupati, 1 July 2017: The temple authorities observed mock “Hunting Festivla” which is popular in Agama language as “Paruveta Utsavam” with religious fervour on Saturday.

The temple management of Tirumala Tirupati Devasthanams (TTD) has made all arrangements for the successful conduct of the event. The deity was taken on a procession to the ‘Parveta Mandapam’, located 5 km from the temple on Srivari Mettu route.

As the purpose is ‘hunting’, the processional deity (Utsava Vigraham) is made to wield all of His weapons. As the unique festival started, the priests performed the mock hunt festival by throwing a spear on replicas of wild beasts, on behalf of the Lord. TTD Joint Executive Officer Tirupati Sri Pola Bhaskar, took part in this mock hunting fete recreated in the festival. Devotees also took part in this unique festival with enthusiasm and cheered the officers and priests when the enacted the hunting by throwing weapons on the replicated wild beasts.

Later speaking on this occasion, Tirupati JEO said, the temple management has started this festival on the lines of Tirumala in 2015. “After seeing the serenity of the premises here, we are now contemplating to start Karthika Vanabhojanam also in the ensuing auspicious Karthika month after discussing with our Executive Officer Sri Anil Kumar Singhal”, he added.

Deputy Executive Officer Venkataiah, AEO Sri Dhanajeyulu was also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం

తిరుపతి, 2017 జూలై 01: సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారు నడిచిన మార్గంగా భక్తులు విశ్వసించే శ్రీవారి మెట్టు సమీపంలో శనివారం శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ ఉత్సవంలో పాల్గొన్న టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ లోకసంరక్షణార్థం, భక్తుల భయోత్పాతాలు తొలగించేందుకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తిరుమల తరహాలో 2015వ సంవత్సరం నుంచి ఇక్కడ పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడి పార్వేట మండపాన్ని మరింత అభివృద్ధిపరుస్తామని తెలిపారు.

ముందుగా ఉదయం 9.00 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమైంది. ఉదయం 11.00 గంటలకు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి స్వామివారు చేరుకున్నారు. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో స్వామివారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, ఎఈవో శ్రీ ధనంజయ, ప్రధాన అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.