MOHINI AVATARAM HELD _ ప‌ల్ల‌కీలో మోహినీ అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

TIRUPATI, 14 JUNE 2022: As part of the ongoing annual Brahmotsavams Mohini Avataram was held in Appalayagunta temple on Tuesday.

 

Sri Prasanna Venkateswara decorated as Mohini, the celestial damsel, blessed devotees with His mesmerizing charm.

 

Deputy EO Sri Lokanatham, Kankanabhattar Sri Suryakumaracharyulu, Superintendent Smt Srivani, Temple Inspector Sri Siva Kumar and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప‌ల్ల‌కీలో మోహినీ అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి, 2022 జూన్ 14: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది.

అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాధం, కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.