MOHINI AVATARAM MEAMERISES _ ప‌ల్ల‌కీలో మోహినీ అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

TIRUPATI, 21 TIRUPATI 2024: The fifth day on Friday witnessed Sri Prasanna Venkateswara in Mohini Avataram on the finely decorated Palanquin. The devotees were mesmerized to see the charm of Sri Prasanna Venkateswara as the Universal Damsel Mohini.

Snapana Tirumanjanam was performed to the utsava deities after the Pallaki Utsavam.

Temple DyEO Sri Govindarajan, AEO Sri Ramesh, Kankanabhattar Sri Suryakumaracharyulu, Superintendent Smt Srivani, temple inspector Sri Siva Kumar and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ప‌ల్ల‌కీలో మోహినీ అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి, 2024 జూన్ 21: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు స్వామివారు మోహినీ అలంకారంలో ద‌ర్శ‌మిచ్చారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

అనంతరం ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.

రాత్రి 7.30 గంటల నుండి విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో రమేష్, కంకణ భట్టర్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.