MOHINI DAZZLES TO MESMERIZE DEVOTEES _ మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

TIRUMALA, 19 OCTOBER 2023: On the morning of Thursday, on the fifth day of the ongoing Navaratri Brahmotsavam in Tirumala, Sri Malayappa donned Mohini avatara – the celestial damsel along with Sri Krishna Swamy on another palanquin to bless the devotees gathered in the galleries of four mada streets. Unlike other Vahana Sevas, Pallaki Utsavam(Mohini Avataram) commenced in front of the Tirumala temple.

As legends put it Lord’s appearance as bejewelled and charming Mohini throws the demons (Asuras) in confusion and wins the celestial battle in favour of the Devatas. The objective of the  Mohini avatar is also to indicate that the entire universe is spellbound under the Mystic Mohini (Maya) and that the Lord of Tirumala is the kingpin and key architect of this high drama in the universe. The devout say that by appearing as Mohini during the Srivari Brahmotsavam Lord Venkateswara had sent a message that the entire universe was a creation of His  Maya. To overcome this maya of materialistic world everyone should worship Him.

Tirumala Sri Pedda Jeeyar along with his deputy Sri Chinna Jeeyar, TTD Chariman Sri Bhumana Karunakara Reddy, EO Sri AV Dharma Reddy and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

తిరుమల, 2023 అక్టోబరు 19: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

మోహినీ అవతారం – మాయా మోహ నాశ‌నం
       
 ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

గ‌రుడ వాహ‌నం

రాత్రి 6.30 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షిస్తారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.