MOHINI ON PALLAKI _ మోహిని అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
TIRUPATI, 04 MARCH 2024: On the fourth morning, Sri Kalyana Venkateswara decked as Mohini took out a celestial ride on the finely decked Palanquin on Monday.
The ongoing annual Brahmotsavam at Srinivasa Mangapuram witnessed the divine damsel made the devotees breathless with Her enchanting glamour.
JEO Sri Veerabrahmam, Spl Gr DyEO Smt Varalakshmi and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
మోహిని అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
తిరుపతి, 2024 మార్చి 04: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో దర్శమిచ్చారు.
ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
రాత్రి 7 గంటల నుండి విశేషమైన గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
వాహనసేవలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ వెంకటస్వామి, ఆలయ అర్చకులు బాలాజి రంగచార్యులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.