MONTH OF JUNE THIS YEAR BETTERS ITS RECORD OF PREVIOUS YEAR IN EVERY AREA_ ఈ ఏడాది జూన్ నెల‌లో 24.66 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం

SRIVARI HUNDI RECORDS 100 CRORES IN THE MONTH OF JUNE THIS YEAR

Tirumala, 5 Jul. 19: In a record of its sorts, the month of June recorded a Hundi collection of Rs.100crores in Tirumala apart from registering a total of 24.66lakh pilgrims who had darshan of Lord Venkateswara for the month.

The month of June in 2019 recorded better figures when compared to June last in every area, be it distribution of laddus, serving of annaprasadam, tonsures etc.

When 24.10lakh pilgrims had darshan of Lord during June last, this year an additional 2.56lakh pilgrims had darshan while the Srivari Hundi collected Rs.91.81cr during last June, this year it has crossed the magic figure taking the total to Rs.100.37crores.

In other areas, when Annaprasadam was served to 64.05lakh pilgrims during last June, this year 71.02lakh have been served. About 95.58lakh laddus were distributed during last year while this year the figure has been recorded as 1.13crores. In this June 12.88lakh tonsures were recorded as against 11.90lakhs during June last. The occupancy rate of accommodation recorded a percentage of 107 this June against 106% during last.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఈ ఏడాది జూన్ నెల‌లో 24.66 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు

తిరుమల, 2019 జూలై 05: తిరుమ‌ల శ్రీ‌వారిని ఈ ఏడాది జూన్ నెల‌లో 24.66 ల‌క్ష‌ల మంది ద‌ర్శించుకున్నారు. ఇందులో భాగంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం, హుండీ ఆదాయం, ల‌డ్డూ ప్ర‌సాదాలు, అన్నప్రసాదాల పంపిణీ, తలనీలాలు, గ‌దుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

దర్శనం :

– గతేడాది జూన్‌లో 24.1 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది జూన్‌లో 24.66 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం :

– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది జూన్‌లో రూ.91.81 కోట్లు కాగా, ఈ ఏడాది జూన్‌లో రూ.100.37 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :

– గతేడాది జూన్‌లో 64.05 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది జూన్‌లో 71.02 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూలు :

– గతేడాది జూన్‌లో 95.58 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది జూన్‌లో 1.13 కోట్ల‌ లడ్డూలను అందించారు.

తలనీలాలు :

– గతేడాది జూన్‌లో 11.9 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించగా, ఈ జూన్‌లో 12.88 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.

గ‌దులు :

– గ‌దుల ఆక్యుపెన్సీ గతేడాది జూన్‌లో 106 శాతం న‌మోదు కాగా, ఈ ఏడాది జూన్‌లో 107 శాతం న‌మోదైంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.