SKVST GEARS UP FOR SAKSHATKARA VAIBHAVAM_ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్స‌వాల‌కు స‌ర్వం సిద్ధం

Tirupati, 5 Jul. 19: The famous shrine of Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram has been geared up to host the three day annual fete, Sakshatkara Vaibhavotsavams from July 6 to 8.

Every day there will be snapana tirumanjanam to deities in connection with this event in the morning while in the evening, on first day Lord will be taken out on Pedda Sesha Vahanam, on second day on Hanumantha Vahanam and on the last day on Garuda Vahanam.

Meanwhile on July 9, Paruveta Utsavam will be observed near Srivari Mettu.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్స‌వాల‌కు స‌ర్వం సిద్ధం

జూలై 05, తిరుపతి, 2019: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వ‌హించేందుకు స‌ర్వం సిద్ధ‌మైంది. ఇందుకోసం ఆల‌యంలో ప్ర‌త్యేకంగా విద్యుత్, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టారు. వాహ‌న‌సేవ‌ల కోసం పెద్ద‌శేష‌, హ‌నుమంత‌, గ‌రుడ వాహ‌నాల‌ను సిద్ధం చేశారు.

ఇందులో భాగంగా మొద‌టిరోజైన శ‌నివారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 8 నుండి 9 గంటల వరకు పెద్ద‌శేష వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తారు.

కాగా, జూలై 7న హనుమంత వాహనం, జూలై 8న గరుడ వాహన‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి.

జూలై 9న పార్వేట ఉత్సవం :

సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూలై 9న పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 9 నుండి మ‌ధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం చేప‌డ‌తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.