FLOWERY TRIBUTES TO DR MS SUBBULAKSHMI_ శ్రీమతి ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

Tirupati, 16 September 2017: Flowery tributes were paid to Bharata Ratna Smt MS Subbulakshmi under the aegis of the SV dance and music college on the ocassion of her 101st Jayanti by music lovers of Tirupati.

Students and teachers of the college presented some keertans of carnatic music sung by MS on the ocassion.

Among others Principal of the SV music college Smt YVS Padmavati, prominent singer Elapata Shiv Prasad and other admirers of MS participated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీమతి ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

సెప్టెంబర్‌ 16, తిరుపతి, 2017 : భారతరత్న శ్రీమతి ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి 101వ జయంతిని పురస్కరించుకుని టిటిడి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలోని పూర్ణకుంభం సర్కిల్‌ వద్దగల ఆమె విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి శ్రీమతి ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి గానం చేసిన పలు కీర్తనలను ఆలపించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి, ప్రముఖ కళాకారుడు ఈలపాట శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.