ARCHAKAS ARE GUARDIAN ANGLES OF SANATHANA HINDU DHARMA- JEO SRI POLA BHASKAR_ అర్చకులు సనాతన ధర్మ రథసారథులు : జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati,16 September 2017: The Tirupati Joint Executive Officer Sri Pola Bhaskar today emphasised the role of Archakas as the prime promoters of Sanatana Hindu Dharma.

Inaugurating the second batch of archaka training for dalits, tribals and fishermen under the aegis of the HDPP at SVETA here he said the archakas would function as custodians of Sanatana Hindu Dharma in temples in remote areas.

He said 500 temples were got up in remote areas of the state under the state endowment department for which the TTD was providing financial support and so far 100 temples were already completed. Eligible candidates from these regions were selected for training in archakatvam to serve in these temples, he said.

The JEO said 30 candidates in each batch were given training for 15 days in the art of priesthood, basic rituals and their role in the society. They were selected by district dharma prachara mandals on the criteria of social interest and on class less initiative as Temple system was part of Indian culture.

Among others TTD Projects OSD Sri N Mukteswar Rao, HDPP Secretary Sri Ramakrishna Reddy, OSD for Purana Ithihasa project Dr Samudrala Lakshmanaiah, Director of SVETA Smt Chenchulakshmi, HDPP project officers Sri Ramana Prasad, Archaka Training coordinator Dr P Chenchusubbaiah, AEO Sri Nageswar Rao and 30 Archaka trainees from 10 districts of AP participated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

అర్చకులు సనాతన ధర్మ రథసారథులు : జెఈవో శ్రీ పోల భాస్కర్‌

శ్వేతలో రెండో దశ అర్చక శిక్షణ ప్రారంభం

సెప్టెంబర్‌ 16, తిరుపతి, 2017 : మారుమూల ప్రాంతాల్లోని ఆలయాల్లో గల అర్చకులు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే రథసారథులని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం హరిజన, గిరిజన, మత్స్యకారులకు రెండో దశ అర్చక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు తరఫున మారుమూల ప్రాంతాల్లో 500 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఇందుకోసం టిటిడి ఆర్థికసాయం అందిస్తోందని తెలిపారు. ఇప్పటికి దాదాపు 100 ఆలయాల నిర్మాణం పూర్తయిందని, వీటిలో అర్చకత్వం చేపట్టేందుకు ఆయా ప్రాంతాల్లోని వారిని ఎంపిక చేసి అర్చక శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ఒక్కో బ్యాచ్‌లో 30 మంది చొప్పున 15 రోజులు శిక్షణ ఇస్తామన్నారు. ఇందులో ధర్మం, దేవాలయం, అర్చకత్వం, అర్చకుడు సమాజ భాగస్వామ్యం అనే అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. దేవాలయ వ్యవస్థ భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, అర్చకుడు వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ధర్మాచరణ వైపు ప్రజలను నడిపించాలని జెఈవో కోరారు. ముఖ్యంగా యువతను భక్తిమార్గం వైపు మళ్లించాలని, ఆధ్యాత్మిక చింతన లేకపోతే జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోలేరని అన్నారు. పురాణయుక్తంగా అర్చకత్వం చేసేందుకు వర్గాలతో సంబంధం లేకుండా ఎవరైనా అర్హులేనని చెప్పారు. జిల్లా ధర్మప్రచార మండళ్ల ద్వారానూ కొంతమందిని ఎంపిక చేసి అర్చక శిక్షణ ఇస్తామన్నారు.

ఈ సమావేశంలో టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| సముద్రాల లక్ష్మణయ్య, శ్వేత సంచాలకులు శ్రీమతి చెంచులక్ష్మి, హెచ్‌డిపిపి ప్రాజెక్టు అధికారి శ్రీ రమణప్రసాద్‌, అర్చక శిక్షణ కో-ఆర్డినేటర్‌ డా|| పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, ఏఈవో శ్రీ నాగేశ్వరరావు, రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి వచ్చిన 30 మంది హరిజన, గిరిజన, మత్స్యకారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.