MUSICAL TRINITY FEST OFF TO A COLOURFUL START IN MAHATI_ ఎస్వీ సంగీత కళాశాలలో వైభవంగా సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు ప్రారంభం
Tirupati, 12 March 2018: As a befitting tribute to the Carnatic Music Trio, Sri Syama Sastry, Sri Tyagaraja Swmay and Sri Muttuswamy Dikshitar, the three-day Aradhanaotsavams commenced on a grand note with the rendition of the kritis penned by the Trinity under the aegis of SV College of Music and Dance.
The fete which commenced on Monday in the sv music college auditorium enthralled the music and art lovers of Tirupati with the melodious notes of the carnatic music Trinity. The students, faculty rendered the songs under the supervision of SV College of Music and Dance Principal Smt YVS Padmavathi.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ సంగీత కళాశాలలో వైభవంగా సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు ప్రారంభం
మార్చి 12, తిరుపతి, 2018: కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్యామశాస్త్రులు, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల ఆరాధనోత్సవాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో సోమవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. పలు కీర్తనలు మరుగున పడుతున్న నేపథ్యంలో వాటిని వెలుగులోకి తీసుకువచ్చి విద్యార్థులకు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.
ముందుగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి. వై.వి.యస్.పద్మావతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, కళాకారులు కలసి ఉదయం 9 గంటలకు కళాశాల ప్రాంగణంలోని వినాయకుడు, శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి శ్రీవారి చిత్రపటాన్ని ఊరేగింపుగా మేళతాళాల మధ్య కళాశాల వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత శ్రీ వి.సత్యనారాయణ బృందం, శ్రీ.హరిబాబు, శ్రీమతి లక్ష్మీసువర్ణ బృందాలు నాదస్వర వాద్య సంగీత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు సంగీత కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, స్థానిక కళాకారులు పలు కీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.
ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు శ్రీ ఎ.చెన్నయ్య వేణువు, శ్రీమతి జి.జ్ఞానప్రసూన వీణ, శ్రీ కె.వెంకటకృష్ణ వయొలిన్ వాద్యప్రదర్శనలిచ్చారు. శ్రీమతి సి.సంగీతలక్ష్మి సంగీతోపన్యాసం చేశారు.
ఆకట్టుకున్న త్యాగయ్య పంచరత్న కృతుల బృందగానం :
ఆరాధనోత్సవాల్లో భాగంగా సాయంత్రం జరిగిన శ్రీ త్యాగరాజస్వామివారి ఘనరాగ పంచరత్న కృతుల బృందగానం ఎంతగానో ఆకట్టుకుంది. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి దాదాపు 100 మంది గానం చేశారు. ఇందులో ”జగదానందకారక…., దుడుకుగల…., సాధించెనే…., కనకనరుచిరా…., ఎందరో మహానుభావులు….” తదితర కీర్తనలున్నాయి. అనంతరం ఉత్సవ, దివ్యనామ సంకీర్తనల బృందగానం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్వీ నాదస్వర పాఠశాల హెడ్‌మాస్టర్ శ్రీ సత్యనారాయణ, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, కళాకారులు, పురప్రజలు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.