46TH JEER OF AHOBILA MUTT OFFERS PRAYERS AT TIRUMALA TEMPLE_ తిరుమలలోశ్రీ అహోబిల మఠం స్వామీజీకి పెద్దమర్యాద

Tirumala, 12 March 2018: H.H. Sri Sri Ranganatha Yatheendra Mahadesikan, 46th Jeeyar of Sri Ahobila Mutt offered prayers to Lord Venkateswara in Tirumala on Monday morning. On his arrival infront of Srivari Temple TTD EO Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju and Temple priests welcomed him with temple honors and led him to Sanctum Santorium.

Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, OSD Sri Seshadhri, Bokkasam incharge Sri Gururaja Rao, Parpatheyadar Sri Ramachandra and others were present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలోశ్రీ అహోబిల మఠం స్వామీజీకి పెద్దమర్యాద

మార్చి 12, తిరుమల 2018: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని శ్రీ అహోబిల మఠం 46వ మఠాధిపతి శ్రీవన్‌ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజీకి టిటిడి శ్రీవారి ఆలయం తరపున సోమవారం ఉదయం పెద్ద మర్యాద చేశారు.

ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు స్వామీజీ చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందచేశారు.

అహోబిలంలో పురాతన ప్రాశస్త్యం గల శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం కొలువై ఉంది. శ్రీవారి అపరభక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు ఇక్కడ దీక్ష పొంది మంత్రోపదేశం పొందారు. ఈ మంత్రోపదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారని ప్రాశస్త్యం.

ఈ కార్యక్రమంలొ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింగాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీవారి ఆలయం డెప్యూటీ ఈవో శ్రీ హరిద్రనాధ్‌, ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, అర్చక స్వాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.