APPLICATIONS INVITED FOR SVCMD ON MAY 30_ మే 30 నుండి ఎస్వీ సంగీత కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Tirupati, 28 May 2018: The applications are invited from interested candidates to join various fine arts courses in the S V College of Dance and Music in Tirupati on May 30 for the academic year 2018-19.

Courses are offered in Vocal, Veena, Violin, Flute, Nadaswaram, Dolu, Bharata Natyam, Kuchipudi, Harikatha, Mridangam, Ghatam. Apart from the regular courses, part time courses are also offered. Interested candidates can apply for these courses on payment of Rs.50 for application in the college during working hours. For regular courses, the candidates should have completed their eighth standard while for evening courses, fifth standard is the qualification. The classes will commence from June 2 on wards.

Contact:0877-2264597 or admission.tirumala.org

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 30 నుండి ఎస్వీ సంగీత కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

మే 28, తిరుపతి, 2018: టిటిడి ఆధ్వర్యంలో ఉన్న తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత, న త్య కళాశాలలో 2018-19వ విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి మే 30 నుండి జూన్‌ 30వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

కళాశాలలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్‌, నాదస్వరం, డోలు, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, హరికథ, మృదంగం, ఘటం విభాగాలున్నాయి. బి.మ్యూజిక్‌, బి డ్యాన్స్‌, విశారద, ప్రవీణ, ఎస్వీ నాదస్వర పాఠశాలలో సర్టిఫికేట్‌, డిప్లొమా, కళాప్రవేశిక రెగ్యులర్‌ కోర్సులతోపాటు సాయంత్రం కళాశాల పార్ట్‌టైమ్‌ కోర్సులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. రెగ్యులర్‌ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కళాశాలకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. జూన్‌ 2వ తేదీ నుండి తరగతులు ప్రారంభిస్తారు.

ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 0877-2264597 నంబరులో సంప్రదించగలరు. లేదా admission.tirumala.org వెబ్‌సైట్‌ను చూడగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.