CARNATIC MUSIC “TRINITY” ARADHANOTSAVAMS FROM MARCH 12-14_ మార్చి 12 నుండి 14వ తేదీ వరకు ఎస్వీ సంగీత కళాశాలలో సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు

Tirupati, 9 March 2018: The Aradhana Mahotsavams of Carnatic Music Trinity will be observed under the aegis of SV College of Music and Dance from March 12-14.

Syama Sastry, Tyagaraya and Muthuswamy Dikshitar are regarded as “The Carnatic Music Trinity” for their contributions in the field of Carnatic music.

The Aradhanotsavams will be observed in Mahati Auditorium for three days from 9am to 9.30pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి 12 నుండి 14వ తేదీ వరకు ఎస్వీ సంగీత కళాశాలలో సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు

మార్చి 09, తిరుపతి, 2018: కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్యామశాస్త్రులు, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల ఆరాధనోత్సవాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, న త్య కళాశాలలో మార్చి 12 నుండి 14వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి.

రోజూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 9.25 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. సంగీత కళాశాల, నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, స్థానిక కళాకారులు సంగీత త్రిమూర్తుల అపురూప కృతులు, కీర్తనలను రోజుకు 90 చొప్పున 3 రోజుల పాటు ఆలపిస్తారు. ఆరాధనోత్సవం సోమవారం ఉదయం 9.00 గంటలకు సంగీత త్రిమూర్తులకు పూజతో ప్రారంభమవుతుంది. అరగంట కాలవ్యవధితో రాత్రి 9.30 గంటల వరకు సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ త్యాగరాజస్వామివారి ”ఘనరాగ పంచరత్న క తులు, ఉత్సవ సంప్రదాయ, దివ్యనామ సంకీర్తనల” బ ందగానం జరుగనుంది.

శ్రీశ్యామశాస్త్రి (1762-1827) :

సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ శ్యామశాస్త్రి తిరువారూరులో జన్మించారు. తంజావూరులో స్థిరపడ్డారు. తరతరాలుగా బంగారు కామాక్షిని పూజించిన కుటుంబ వీరిది. వీరికి వేంకటసుబ్రమణ్యం అనే పేరుంది. తెలుగు, తమిళ, సంస్కృత భాషల్లో విశేష ప్రావీణ్యం సంపాదించారు. వీరికి శ్రీత్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు సమకాలికులు. వీరి భైరవి, తోడి, యదుకుల కాంభోజి రాగాల్లోని స్వరజతులు గొప్ప ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాళంలో వీరు చూపిన కొత్త పోకడ ప్రశంసనీయం. వీరి కృతులు శ్యామకృష్ణ ముద్రతో ఉంటాయి. వీరి నవరత్నమాలిక కృతులు చాలా ప్రసిద్ధి పొందాయి. కీర్తనలకు చిట్ట స్వరాలు, వాటికి సాహిత్యం వీరి నుండే ప్రారంభమైంది.

శ్రీ త్యాగరాజస్వామి (1767-1847) :

శ్రీ త్యాగరాజస్వామివారు తంజావూరు జిల్లాలోని తిరువారూరు క్షేత్రంలో శ్రీమతి సీతమ్మ, శ్రీరామబ్రహ్మం దంపతులకు జన్మించారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో రెండోవారుగా ప్రసిద్ధిచెందారు. నాదోపాసనే మోక్షహేతువని నమ్మి తరించిన నాదయోగి త్యాగయ్య చిన్నతనం నుండే భక్తి వాతావరణంలో పెరిగారు. 24 వేల కృతులు ఆలపించారని ప్రచారంలో ఉన్నా ప్రస్తుతం 750 కృతులు మాత్రమే లభ్యమవుతున్నాయి. శ్రీ రామకృష్ణానంద యతీశ్వరుల ఉపదేశంతో 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి రామ సాక్షాత్కారం పొందిన భాగవత శిరోమణి ఈయన.

శ్రీ ముత్తుస్వామి దీక్షితులు (1775-1835) :

శ్రీ ముత్తుస్వామి దీక్షితులు తిరువారూరులో రామస్వామి దీక్షితులు, సుబ్బలక్ష్మి అమ్మాళ్‌ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండి భగవధ్యానపరులు. వీరు కాశీ క్షేత్రానికి వెళ్లి చిదంబరనాదయోగి వద్ద శ్రీవిద్యా ఉపదేశం చేశారు. గురువుల ఆశీస్సులు వారి ఆజ్ఞానుసారం తిరుత్తణి క్షేత్రంలో 45 రోజులుండి శ్రీ సుబ్రమణ్యస్వామిని ఉపాసించారు. వీరి కృతులు చాలావరకు సంస్కృతంలో ఉంటాయి. వీరి కమలాంబ నవార్ణకృతులు, నవగ్రహకృతులు, విభక్తి కృతులు, పంచలింగస్థల కృతులు, షోడశగణపతి కృతులు ప్రసిద్ధి పొందాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.