MUTTANGI KAVACHAM ON SECOND DAY TO LORD MALALYAPPA _ ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం

Tirumala, 5 Jun. 20: As a part of the ongoing annual three day Jyestabhishekam in Tirumala temple, Sri Malayappa Swamy donned Muttangi Kavacham on Friday after Abhideyaka Abhishekam.

Earlier during the day, Sri Malayappa flanked by Sridevi and Bhudevi was brought to Sampangi Prakaram at around 7:30am. At 8am, the Archakas performed Mahashanti Homam followed by Abhideyaka Abhishekam between 9am and 11am amidst the chanting of Veda Mantras.

Later, the Lord was decked with Muttangi (Armour made of pearls) kavacham.

HH Sri Chinna Jiyar Swamy and HH Sri Chinna Jiyar Swamy of Tirumala, TTD Trust Board Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy and officials took part.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం

తిరుమల, 2020 జూన్ 05: తిరుమల శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు శుక్ర‌వారం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి అభ‌య‌మిచ్చారు.

ఉదయం 7.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకం చేపట్టారు. సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి,  ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.