MUTYAPU PANDIRI VAHANAM HELD _ ముత్యపుపందిరి వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం

Tirupati, 07 April 2024: On Sunday evening, as part of the ongoing annual Brahmotsavam at Sri Kodanda Rama Swamy temple in Tirupati, Sri Ramachandra Murty took a celestial ride on Mutyapu Pandiri Vahanam to bless His devotees.

Both the senior and junior Pontiffs of Tirumala, DyEOs Sri Govindarajan, Smt Nagaratna, VGO Sri Bali Reddy, AEO Sri Parthasarathy, Kankanabhattar Sri Sitaramacharyulu, and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముత్యపుపందిరి వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం

తిరుపతి, 2024 ఏప్రిల్ 07: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు భక్తులను కటాక్షించారు.

గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్, శ్రీమతి నాగరత్న, విజివో శ్రీ బాలి రెడ్డి, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, కంకణభట్టర్ శ్రీ సీతారామాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.