NADA NEERAJANAM MANDAPAM FILLS CULTURAL SPIRIT AMONG DEVOUT_ పొడ‌గంటిమ‌య్యా నిన్ను పురుషోత్త‌మా… నాద‌నీరాజ‌నం వేదిక‌పై భ‌క్తిభావాన్ని పంచిన అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

Tirumala, 11 October 2018: The cultural activities of Brahmotsavam commenced at the Nada Niranjanam open theater with the Mangaladwani by B Lakshmi Suvarna and Ch.Malleswar Rao and team in the early hours on Thursday.

The students and teachers of the Sri Venkateswara Pathashala presented the Chaturveda Parayanam.

Later on the Smt M Meenakshi and team of Tirupati rendered Vishnusahasranamam besides the Dharmikopanyasam by Sri KT Ramanujacharyulu of Nellore.

In the afternoon, Sri MLR Karthikeyan troupe from Chennai rendered the Annamayya Sankeertans followed by the Guruopaduka Bhajan mandali of Mumbai who presented the Nama sankeertan.

In the evening, Smt Vasudha Prahlad team from Bangalore presented sankeertans at Unjal Seva.

The events came to an end at the Nada Niranjanam theatre for the day with the harikatha by Bhagavathakarini Smt. Y Shikamani.

At the Asthana Mandapam, Sri Ravi Shankar troupe from Guntur presented the Bhakti Sangeet in the morning hours.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

పొడ‌గంటిమ‌య్యా నిన్ను పురుషోత్త‌మా… నాద‌నీరాజ‌నం వేదిక‌పై భ‌క్తిభావాన్ని పంచిన అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

అక్టోబ‌రు 11, తిరుమల 2018: పొడ‌గంటిమ‌య్యా నిన్ను పురుషోత్త‌మా….అంటూ చెన్నైకి చెందిన శ్రీ ఎంఎల్ఆర్‌.కార్తికేయ‌న్ బృందం గురువారం నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆల‌పించిన అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు భ‌క్తిభావాన్ని పంచాయి. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను పుర‌స్క‌రించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద‌పాఠ‌శాల సంయుక్త‌ ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం శ్రీ బి.ల‌క్ష్మీసువ‌ర్ణ‌, సి.హెచ్‌.మ‌ల్లేశ్వ‌ర‌రావు బృందం మంగళధ్వని, తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. అదేవిధంగా, తిరుపతికి చెందిన శ్రీ‌మ‌తి ఎం.మీనాక్షి బృందం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, నెల్లూరుకు చెందిన శ్రీ కె.టి.రామానుజాచార్యులు ధార్మికోపన్యాసం చేశారు.

సాయంత్రం అన్నమయ్య విన్నపాలు కార్య‌క్ర‌మంలో భాగంగా చెన్నైకి చెందిన శ్రీ ఎంఎల్ఆర్‌.కార్తికేయ‌న్ బృందం ” నీకే శ‌ర‌ణు…., క‌లియుగ‌మెటులైన క‌ల‌దుగా నీ క‌రుణ‌….., గోవిందాశ్రిత గోకుల బృంద త‌దిత‌ర కీర్త‌న‌ల‌ను భ‌క్తియుక్తంగా గానం చేశారు. ఆ త‌రువాత ముంబైకి చెందిన గురుపాదుకా భ‌జ‌న‌మండ‌లి భ‌జ‌న సంప్ర‌దాయంలో ప‌లు కీర్త‌న‌ల‌ను ల‌య‌బ‌ద్ధంగా ఆల‌పించారు. ఊంజల్‌సేవలో బెంగ‌ళూరుకు శ్రీ‌మ‌తి వ‌సుధ ప్ర‌హ్లాద్ బృందం అన్నమాచార్య సంకీర్తనలను ర‌స‌ర‌మ్యంగా గానం చేశారు. అనంత‌రం రామ‌చంద్రాపురానికి చెందిన శ్రీ‌మ‌తి వై.శిఖామ‌ణి భాగ‌వ‌తారిణి హరికథ పారాయణం చేశారు.

అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో గురువారం ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు గుంటూరుకు చెందిన శ్రీ డి.ర‌విశంక‌ర్ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.