NADANEERAJANAM PROVIDES FULL DEVOTIONAL FEAST _ నాదనీరాజనం వేదికపై ఆక‌ట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

Tirumala, 1 Oct 19: The Nadaneerajanam platform in Tirumala hosted a grand gala of spiritual cultural events on Tuesday which enthralled devotees.

Commenced with Mangaladhwani of Nadaswaram by Smt B Lakshmisuvarna and team followed by Chaturveda Parayanam, Vishnusahasranama Parayanam and Dharmikopanyasam.

In the evening, Musical concert by Sri Ramachari and team, Namasankeertanam by Sri Shanmugam of Kumbhakonam, devotional sankeertan rendered by Smt Nandini Rao of Pune during Unjal seva mused devotees.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI 

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

నాదనీరాజనం వేదికపై ఆక‌ట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

అక్టోబరు 01, తిరుమ‌ల‌, 2019: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 5 నుండి 5.30 గంటల వరకు శ్రీమ‌తి బి.ల‌క్ష్మీసువ‌ర్ణ బృందం మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ‌మ‌తి కెవి.ల‌క్ష్మి బృందం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు విజ‌య‌వాడ‌కు చెందిన శ్రీ జి.మోహ‌నాచార్యులు ధార్మికోపన్యాసం చేశారు.

మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ రామాచారి బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు కుంభ‌కోణానికి చెందిన శ్రీ ఆర్‌.ష‌ణ్ముగం బృందం నామసంకీర్తన, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో పుణెకి చెందిన శ్రీమతి పి.నందినీరావు బృందం అన్నమాచార్య సంకీర్తనలను వీనుల‌విందుగా గానం చేశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ఎం.రాముడు భాగ‌వ‌తార్ హరికథ పారాయణం చేశారు.

అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో మంగ‌ళ‌వారం ఉదయం 11.30 నుండి 12.30 గంటల వరకు విజ‌య‌వాడ‌కు చెందిన శ్రీ విశ్వ‌నాథ్ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది