NADASWARAM CONCERT PERFORMED AT KAPILATHIRTHAM _ కపిలతీర్థంలో అలరించిన నాదస్వర కచేరీ

Tirupati, 05 March 2024: The music and dance programs organized by Sri Venkateswara College of Music and Dance and Sri Venkateswara Nadaswara and Dolu School on the fifth day of the annual Brahmotsavam of Sri Kapileswara Swamy were impressive.

As a part of this, the Nadaswara concert by teachers Smt. Raviprabha, Sri. Subramaniam and their disciples on the stage arranged in the temple premises stole the hearts of music lovers.

Later, the rhythmic vinyasam performed by the college mridangam teachers Sri. Sudhakar, Sri. Ramesh, Sri. Shankar and their group of students won the souls of audience.

After that a Bharatanatyam performance by Smt. Subhashini’s troupe, an alumnae of the college, allured the devotees.

In this program the Principal of the college Dr.Uma Muddubala and others participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

కపిలతీర్థంలో అలరించిన నాదస్వర కచేరీ

తిరుప‌తి, 2024, మార్చి 05: శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగళవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై అధ్యాపకులు శ్రీమతి రవిప్రభ, శ్రీ సుబ్రమణ్యం, వారి శిష్య బృందం నాదస్వర కచేరీ ఎంతగానో ఆకట్టుకుంది.

అనంతరం కళాశాల మృదంగం అధ్యాపకులు శ్రీ సుధాకర్, శ్రీ రమేష్, శ్రీ శంకర్, వారి శిష్య బృందంతో ప్రదర్శించిన లయ విన్యాసం లయబద్ధంగా సాగింది. ఆ తరువాత కళాశాల పూర్వ విద్యార్థిని శ్రీమతి సుభాషిణి బృందం భరతనాట్య ప్రదర్శన చక్కటి అభినయంతో సాగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.