NAMA SANKEERTANA IS THE BEST WAY TO GET SALVATION IN KALIYUGA-SRI SRI SRI SUGUNENDRA TEERTHA SWAMY_ కలియుగంలో నామ సంకీర్తన ముక్తి, జ్ఞాన ప్రదాయిని

Tirupati, 27June 2017: The best way to attain salvation in Kaliyuga is by chanting the divine namas of Lord through Nama Sankeertana in Bhajana sampradaya, advocated HH Sri Sri Sri Sugunendra Teertha Swamy of Udipi Puttige Mutt.

He graced on the occasion of the Traimasika Metlotsavam held at Alipiri Padala Mandapam on Tuesday. Before commencing the trekking, in his address to Dasaparas he said, great saints and seers trekked this sacred footpath route chanting Harinama Sankeertana and enlightening tens of thousands of pilgrims. “That is the power of divine chant and today the Dasa Sahitya Project of TTD is continuing the legacy with utmost devotion”, he added.

After performing puja and the religious address, over 3000 Dasa Bhajan devotees trekked the Alipiri path by rendering Dasa Sankeertans in a melodious way.

Project Special Officer Sri PR Ananda Teerthacharya were also present


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కలియుగంలో నామ సంకీర్తన ముక్తి, జ్ఞాన ప్రదాయిని : శ్రీశ్రీశ్రీ సుగుణేంద్ర తీర్థస్వామి తిరుపతిలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి, 2017 జూన్‌ 27: కలియుగంలో నామ సంకీర్తన ఒక్కటే ముక్తి, జ్ఞాన ప్రదాయిని అని, కాలినడకన తిరుమలగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పొందడమే మెట్లోత్సవం అంతరార్థమని ఉడిపి పుత్తిగె మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుగుణేంద్ర తీర్థస్వామి ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం మంగళవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశ్రీశ్రీ సుగుణేంద్ర తీర్థస్వామి అనుగ్రహభాషణం చేస్తూ వేదాలు, ఉపనిషత్తులలో తెలిపినట్లు కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు వంటి వాగ్గేయకారులు, ఎందరో మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుడా దాస్య భక్తితో నిష్కామ కర్మగా భగవంతుని ధ్యానించాలని, అప్పుడే భగవంతుడు అనుగ్రహిస్తాడని తెలిపారు.

తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ప్రసంగిస్తూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 120 భజన మండళ్లకు చెందిన 3000 మంది సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు తెలిపారు. భజన మండళ్ల సభ్యులకు టిటిడి మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.

అంతకుముందు ఉదయం 4.00 గంటలకు భజనమండళ్ల భక్తులు టిటిడి మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.