NARAPURA VENKATESWARA SWAMY BTU FROM APRIL 29 TO MAY 7_ ఏప్రిల్‌ 29 నుండి మే 7వ తేదీ వరకు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి శ్రీ విళంబినామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్స‌వాలు

Tirupati, 18 April 2018: The annual brahmotsavams of Sri Narapura Venkateswara Swamy in Jammalamadugu of YSR Kadapa district will be observed from April 29 to May 7 with Ankurarpanam on April 27.

Tirupati JEO Sri P Bhaskar released posters for the same in his chambers in TTD administrative building on Wednesday morning. Speaking on this occasion said, the important days in this TTD taken over temple includes Dhwajarohanam on April 29, Garuda Seva on May 3, Rathotsavam on May 5 and Chakrasnanam on May 7.

Temple AEO Sri Ramaraju was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఏప్రిల్‌ 29 నుండి మే 7వ తేదీ వరకు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి శ్రీ విళంబినామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్స‌వాలు

గోడపత్రికలు ఆవిష్కరించిన జెఈవో శ్రీ పోల భాస్కర్‌

ఏప్రిల్‌ 18, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి శ్రీ విళంబి నామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్స‌వాల‌ గోడపత్రికలను తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ బుధవారం ఆవిష్కరించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏప్రిల్‌ 29 నుండి మే 7వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మూెత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 28న అంకురార్పణంతో బ్రహ్మోత్స‌వాలు ప్రారంభమవుతాయన్నారు.

తేదీ ఉదయం సాయంత్రం

29-04-2018(ఆది) ధ్వజారోహణం పెద్దశేష వాహనం

30-04-2018(సోమ) చిన్నశేష వాహనం హంస వాహనం

01-05-2018(మంగళ) ముత్యపుపందిరి వాహనం సింహ వాహనం
02-05-2018(బుధ) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం

03-05-2018(గురు) మోహనీ ఉత్సవం గరుడ వాహనం

04-05-2018(శుక్ర) సర్వభూపాల వాహనం కల్యాణోత్సవం, గజ వాహనం

05-05-2018(శని) రథోత్సవం అశ్వవాహనం

06-05-2018(ఆది) సూర్యప్రభ వాహనము చంద్రప్రభ వాహనం
07-05-2018(సోమ) వసంతోత్సవం, చక్రస్నానం ధ్వజావరోహణం

ఉత్సవాల్లో భాగంగా మే 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆలయ ప్రాశస్త్యం :

స్థల పురాణం ప్రకారం నారాపురయ్య అనే భక్తునికి శ్రీ వేంకటేశ్వర స్వామి కలలో సాక్షాత్కరించి తనను ప్రతిష్టించమని కోరగా ఆ మేరకు మడుగులో శ్రీ స్వామివారి విగ్రహం లభించిందని వెంటనే దానిని పట్టణంలోని ఉత్తరదిశగా వున్న ఇసుకదిన్నెలో ప్రతిష్టించారని, అందువలనే ఈ ఆలయానికి శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయంగా పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. కాగా, నారాపురుడు ప్రతిష్టించిన ఆలయం కాలక్రమంలో శిథిలమైతే 1919వ సం.లో కొందరు భక్తుల సహకారంతో ఆలయ జీర్ణోద్ధరణ జరిగినట్లు ఆలయ ఆవరణలోని శిలాశాసనాల వల్ల తెలుస్తోంది. ఈ దేవాలయం 2008 అక్టోబరు 23 నుండి టిటిడిలోకి విలీనమయ్యాక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడుచున్నవి.

ఈ కార్యక్రమంలో టిటిడి ఏఈవో శ్రీ రామరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.