SIMHACHALAM APPANNA RECEIVES SILK VASTRAMS FROM TIRUMALA VENKANNA_ సింహాచలం అప్పన్నకు టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ

Tirumala, 18 April 2018: Sri Varaha Lakshmi Narasimha Swamy of the famous shrine in Simhachalam received Pattu vastrams from Sri Venkateswara Swamy of Tirumala on Wednesday.

On behalf of TTD, EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju offered the Sare. Speaking on this occasion, the EO said, TTD has been presenting silk vastrams since 1996 on the occasion of Chandanotsavam on the auspicious Akshaya Tritiya day.

Meanwhile this Utsavam is being observed the temple in the holy Visakha month.

Temple OSD Sri P Seshadri was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

సింహాచలం అప్పన్నకు టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ

ఏప్రిల్‌ 18, తిరుమ‌ల‌, 2018: ప్రముఖ పుణ్యక్షేత్రమైన విశాఖపట్నం సమీపంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి(అప్పన్న) టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జేఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు కలిసి టిటిడి తరపున బుధవారం పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ 1996వ సంవత్సరం నుంచి టిటిడి తరుపున శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. దేశంలోని అన్ని నరసింహస్వామి క్షేత్రాల్లో సింహాచలం అతి ప్రాచీనమైనదని, స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారన్నారు.

సింహగిరిపై కొలువైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేకువజామున వైభవంగా ప్రారంభమైంది. సింహాచలం అప్పన్న విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పి ఉంటుంది. సంవత్సరంలో 12 గంటలు మాత్రమే చందనం పూత లేకుండా స్వామివారు దర్శనమిస్తారు. పవిత్రమైన అక్షయతృతీయ రోజున స్వామివారి విగ్రహానికి చందనం పూత తొలగించి తిరిగి పూస్తారు. చందన యాత్ర లేదా చందనోత్సవం పేరిట ప్రతి ఏటా వైశాఖమాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారి తరఫున టిటిడి పట్టువస్త్రాలు సమర్పించింది.

ఈ కార్యక్రమంలో ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, వేదపారాయణదారులు, టిటిడి అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.