NARAYANAGIRI CHATRASTHAPANOTSAVAM PERFORMED AT TIRUMALA_ నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

Tirumala, 4 August 2017: The celestial ritual, Narayanagiri Chatrasthapanotsavam has been performed with religious fervour at Tirumala on Friday.

According to temple legend Narayanagiri happens to be the highest peak in the Seshachalam ranges and it is believed that Lord Venkateswara first stepped his divine feet on this holy hill.

Even after several centuries “Srivari Padalu”, (holy feet of Lord Venkateshwara) is clearly seen on this gigantic peak. TTD has been performing this Chatrasthapanotsavam since several decades where in a holy umbrella will be kept near the Srivari Padalu. The temple priests performed special pujas and later offered prasadams to the devotees.

TTD EO Sri AK Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju and others also took part in this fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

తిరుమల, 04 ఆగస్టు 2017: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత శుక్రవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టిటిడి అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, పేష్కార్‌ శ్రీరమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.