నారాయణవనంలో జనవరి 16న గిరిప్రదక్షిణ ఉత్సవం

నారాయణవనంలో జనవరి 16న గిరిప్రదక్షిణ ఉత్సవం

తిరుపతి, 2017 డిసెంబరు 24: నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అగస్తీశ్వరస్వామి మరియు శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఉత్సవమూర్తుల గిరిప్రదక్షిణ ఉత్సవం(కొండచుట్టు తిరునాళ్ల) జనవరి 16వ తేదీన ఘనంగా జరగనుంది. జనవరి 16వ తేదీ ఉదయం శ్రీ పరాశరేశ్వరస్వామివారు నారాయణవనం పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. అరుణా నది వద్ద శ్రీ అగస్తీశ్వరస్వామివారితో కలిసి ఊరేగింపుగా రాత్రి నగరిలోని కొండచుట్టు మండపం వద్దకు చేరుకుంటారు. నగరి పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన వివిధ దేవతామూర్తులను కొండచుట్టు మండపం వద్దకు చేర్చి పూజా నైవేద్య కార్యక్రమాలు, సంధింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అనంతరం శ్రీ అగస్తీశ్వరస్వామివారు, శ్రీ పరాశరేశ్వరస్వామివారు బయలుదేరి మొట్టిగాని సత్రం, పరమేశ్వరమంగళం, బత్తలవారి కండ్రిగ మీదుగా నారాయణవనంలోని ఆయా ఆలయాలకు చేరుకుంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.