ASTOTTARA SATAKALASABHISHEKAM IN SRI KRT ON JAN 2_ జనవరి 2న శ్రీకోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం

Tirupati, 24 December 2017: On the eve of Pournami the TTD plans to conduct Astottara satakalashabisekamon on January 2 and interested devotees can participate with payment of Rs 50.

In the evening the utsava idols will be taken in procession, later Asthanam at Sri Ramachandra Pushkarani and Pushkarani harati performed.

On January 3 swami and Ammavaru Kalyanotsavam is performed at Sri Kodandarami temple on punarvasu star and devotees can participate with Rs 500 ticket and beget blouse,uttariyam and Annaprasadam.

Similarly on January 16 Girijana pradakshinam featival is performed at the Sri Kalyana Venkateswara Swamy Temple at Narayanavanam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTD TIRUPATI

జనవరి 2న శ్రీకోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం

తిరుపతి, 2017 డిసెంబరు 24: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో జనవరి 2వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

జనవరి 3న శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జనవరి 3వ తేదీ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.

శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.