NARAYANAVANAM BRAHMOTSAVAMS FROM MAY 27 TO JUNE 4_ మే 27 నుండి జూన్‌ 4వ తేదీ వరకు నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 11 May 2018: The annual Brahmotsavams in Narayanavanam will be observed from May 27 to June 4.

The important days includes Dhwajarohanam in Mithuna Lagnam on May 27, Garuda Vahanam on May 31, Rathotsavam on June 3 and Chakrasnanam on June 4.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 27 నుండి జూన్‌ 4వ తేదీ వరకు నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

మే 11, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 27 నుండి జూన్‌ 4వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 22న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 26న అంకురార్పణం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

27-05-18(ఆదివారం) ధ్వజారోహణం(మిథున లగ్నం) పెద్దశేష వాహనం

28-05-18(సోమవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

29-05-18(మంగళవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

30-05-18(బుధవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

31-05-18(గురువారం) మోహినీ అవతారం గరుడ వాహనం

01-06-18(శుక్రవారం) హనుమంత వాహనం గజ వాహనం

02-06-18(శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

03-06-18(ఆదివారం) రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం

04-06-18(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్‌ 3వ తేదీ రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.750/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.