TTD BOARD MEMBER TAKES OATH_ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా శ్రీ సండ్ర వెంకటవీరయ్య ప్రమాణస్వీకారం

Tirumala, 11 May 2018: Sri Sandra Venkata Veeraiah, MLA took oath as board member of TTD Trust board in Tirumala on Friday in the sanctum sanctorum of Tirumala temple.

The TTD Joint Executive officer Sri K.S.Sreenivasa Raju administered the oath of office to Sri Sandra Venkata Veeraiah at the Bangaru Vakili of Tirumala temple on Saturday morning at around 9.50am. Later he had darshan of Lord Venkateswara and Vedasirvachanam in Ranganayakula Mandapam.

TTD Chairman Sri Putta Sudhakara Yadav and Tirumala JEO offered him the prasadam of Lord, lamination photo and spiritual books.

Temple DyEO Sri Haridranath, Deputy EO Sri Malleswari, Reception Dy EO Sri Balaji, OSD Sri Lokanadham were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా శ్రీ సండ్ర వెంకటవీరయ్య ప్రమాణస్వీకారం

మే 11, తిరుమల, 2018: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా శ్రీ సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఉదయం 9.50 గంటలకు శ్రీ సండ్ర వెంకటవీరయ్యతో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు కలిసి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని వారికి అందించారు.

ఈ సందర్భంగా శ్రీ సండ్ర వెంకటవీరయ్య మీడియాతో మాట్లాడుతూ టిటిడి బోర్డు సభ్యునిగా రెండోసారి ప్రమాణం చేశానని, తన జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీహరీంద్రనాథ్‌, శ్రీమతి సి.మల్లీశ్వరిదేవి, శ్రీ బాలాజి, ఏఈవో శ్రీ రమేష్‌బాబు, ఓఎస్‌డి శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.