NARAYANAVANAM CHAKRASNANAM HELD _ శాస్త్రోక్తంగా శ్రీ క‌ల్యాణ శ్రీ‌నివాసుడి చక్రస్నానం

TIRUPATI, 29 MAY 2024: The annual brahmotsavams in Sri Kalyana Venkateswara Swamy temple observed Chakra Snanam on its last day of the nine-day fete and concludes with Dhwajavarohanam on Wednesday evening.

Earlier during the day, Sri Bhu sameta Sri Kalyana Venkateswara were rendered Snapana Tirumanjanam between 10am and 11am.  Later the Sudarshana Chakrattalwar was rendered Chankra Snanam. Devotees also had the celestial bath in the temple tank.

In the evening, Tiruveedhi Utsavam will be observed before Dhwajavarohanam.

Temple DyEO Smt Nagaratna, AEO Sri Parthasarathy, Superintendent Sri Dharmaiah, Temple Inspector Sri Nagaraju were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ క‌ల్యాణ శ్రీ‌నివాసుడి చక్రస్నానం

తిరుపతి, 2024 మే 29: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.

అంతకుముందు ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం చ‌క్ర‌స్నానం ఘ‌నంగా జ‌రిగింది.

సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు న‌వ‌సంధి, మాడ‌వీధి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ ధ‌ర్మ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగ‌రాజు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.