FIVE DAY TEPPOTSAVAMS IN NARAYANAVANAM_ అక్టోబరు 30 నుండి నవంబరు 3వ తేదీ వరకు నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక తెప్పోత్సవాలు

Tirupati, 25 October 2017: The five day annual Teppotsavams in Sri Kalyana Venkateswara Swamy Temple at Narayanavanam will be observed from October 30 to November 3.

On the first day, Lord Sri Kodanda Ramaswamy along with Sita Devi and Lakshmana Swamy takes ride on the float while on second day Sri Andal Devi and on last three days Lord Sri Kalyana Venkateswara Swamy with his two consorts Sridevi and Bhudevi takes ride on the finely decked teppa.

Every day this teppotsavam will be observed between 5:30pm and 8pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అక్టోబరు 30 నుండి నవంబరు 3వ తేదీ వరకు నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుపతి, 2017 అక్టోబరు 25: టిటిడి అనుబంధ ఆలయమైన నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక తెప్పోత్సవాలు అక్టోబరు 30 నుండి నవంబరు 3వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుండి 8.00 గంటల వరకు స్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్బంగా ప్రతి రొజు ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు.

అక్టోబరు 30వ తేదీ మొదటి రోజు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామివారు, రెండో రోజు శ్రీ అండల్‌ అమ్మవారు, చివరి మూడు రోజులు శ్రీ దేవిభూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తెప్పలపై విహరిస్తారు. తెప్పోత్సవాల అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, లక్ష్మీపూజ ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.