కపిలతీర్థంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కపిలతీర్థంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

వైభవంగా శ్రీ వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణం

తిరుపతి, 2017 అక్టోబరు 25: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా రెండు రోజుల పాటు జరిగిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం బుధవారం ఘనంగా ముగిసింది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మహాభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. స్కంధషష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా జరుగనుంది. అనంతరం శ్రీ దక్షిణామూర్తిస్వామివారి కలశస్థాపన, పూజ, జపం, హోమం నిర్వహిస్తారు.

అక్టోబరు 26వ తేదీ గురువారం శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకర్‌రాజు, ఆలయ అర్చకులు శ్రీ మణిస్వామి, శ్రీ స్వామినాథస్వామి, శ్రీవిజయస్వామి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.